కింది నుంచి గ్యాస్ పోవడాన్ని నివారించాలంటే...

కింది నుంచి గ్యాస్ పోయే సమస్యతో కలిగే బాధలు అన్నీ ఇన్నీ కావు. దానితో మొదట సాంఘికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని నివారించడానికి పాటించాల్సిన కొన్ని సూచనలు ఇవి...  
ఆహారంలో అలర్జీ కలిగించే వాటికి దూరంగా ఉండాలి. కొందరికి పాలతో అలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు పాలు తాగగానే కింది నుంచి గ్యాస్ మొదలవుతుంది. అలాంటి సందర్భాల్లో మనకు సరిపడని వస్తువుల వల్ల గ్యాస్ పోతోందని గుర్తించి అలాంటి వాటిని దూరంగా ఉండాలి.

ఉప్పు తగ్గించడం:
 

కొందరిలో ఉప్పు వాడటం పెరగడం వల్ల కూడా గ్యాస్ పోవడం ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువ కాగానే కడుపు ఉబ్బరం కలుగుతుంది. అలాంటిప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటివి తగ్గించడంతో పాటు కూరల్లో, పెరుగులో ఉప్పువేసుకోవడం తగ్గించాలి.

మలబద్దకాన్ని నివారించుకోవడం:
 

ఆహారంలో తగినన్ని పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవడం, అందుకోసం గింజగా ఉండే ధాన్యాలు, కూరగాయలు తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ మలబద్దకాన్ని నివారించుకుంటే గ్యాస్ తగ్గుతుంది.  మన ఆహారంలో కృత్రిమంగా స్వీటెనర్స్‌తో ఉండే శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించాలి. దాంతో గ్యాస్‌పోవడాన్ని చాలా వరకు నివారించవచ్చు. శీతల పానీయాలు ఎక్కువ తాగగానే కడుపు ఉబ్బరంగా ఉంటే... వాటిని తగ్గిచడం అవసరమని గుర్తుంచుకోండి. 
 చ్యూయింగ్ గమ్ మానేయడం:  
చ్యూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవారిలో అది నములుతున్నప్పుడు గాలి మింగడం ఎక్కువగా జరుగుతుంది. అదే గ్యాస్ కింది నుంచి పోవడం జరుగుతుంటుంది. ఆహారం నమిలేప్పుడు కూడా ఇలా గాలి మింగుతాం. అయితే అప్పుడు మింగే గాలి పరిమాణంతో పోలిస్తే చ్యూయింగ్‌గమ్ నములుతున్న ప్పుడు మింగే గాలి ఎక్కువ. అందుకే చ్యూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటే గ్యాస్ పోతుండే వారు ఆ అలవాటును తగ్గించు కోవాలి   నెమ్మదిగా తినాలి:
గబగబా తినే అలవాటు ఉన్నవారిలో కూడా గాలి ఎక్కువగా కడుపులోకి వెళ్లి గ్యాస్ నిండవచ్చు. అందుకే ఆహారం తీసుకునే సమయంలో నెమ్మదిగా, నింపాదిగా, నమిలి మింగాలి.  కొన్ని కూరలను తగ్గించండి:
చాలా మందికి క్యాబేజీ, బీన్స్, క్యాలీఫ్లవర్ తిన్నప్పుడు గ్యాస్ నిండుతుంది. ఆ ఆహారాన్ని నివారించడం వల్ల గ్యాస్‌ను తగ్గించవచ్చు.
 

తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు:
ఒకేసారి ఎక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం మంచిది.  కొవ్వులు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఆ వ్యవధి పెరుగుతున్న కొద్దీ కింది నుంచి గ్యాస్‌పోయే అవకాశాలు పెరుగుతుంటాయి. అందుకే కొవ్వులు తినడం తగ్గించాలి. మరో జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొవ్వులు తీసుకున్నప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top