మనం రోజూ చేయగల కొన్ని పనులతో మన రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగు పరుచుకోవడం ఎలాగో తెలుసుకోండి.

ప్రతివారిలో స్వాభావికంగానే రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో రోజూ జరిగే జీవక్రియలతో విషాలు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి అనేక అవయవాలు, శరీరవ్యవస్థ నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల పెరిగిన కాలుష్యం, వాతావరణంలోని మార్పులు, ఆహార అలవాట్లతో ఎంతగా ప్రయత్నించినా పూర్తిగా విషప్రభావం తొలగడం లేదు. దాంతో వయసు కంటే ముందుగానే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం, చర్మం కాంతిని కోల్పోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి కనిపిస్తున్నాయి. మనం రోజూ చేయగల కొన్ని పనులతో మన రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగు పరుచుకోవడం ఎలాగో తెలుసుకోండి. 
  •  ఒక కప్పు వేడి నీటిలో ఒక నిమ్మకాయను పిండి, అల్లం రసాన్ని కలుపుకుని రోజూ నిద్రలేవగానే తాగండి. అది మనలోని అనేక వ్యవస్థలను శుభ్రపరుస్తుంది.
  • రోజూ నిద్ర లేవగానే ఐదు నిమిషాల పాటు గాఢంగా శ్వాస తీసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా యోగా చేయలేనివారికి, కొంతకాలం యోగా చేసి ఆపేసిన వారికీ ఇలా గాఢంగా శ్వాసతీసుకోవడం ఉపయోగపడుతుంది.
  • ఉదయం నిద్రలేవగానే మసాజ్ చేసుకున్నట్లుగా మీ ఒంటిపైన రుద్దుకోండి. అలా చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ పెరిగి చర్మం చాలాకాలం పాటు బిగుతుగా ఉంటుంది. అయితే ఈ రుద్దుకోవడం అన్నది బలంగా జరగకుండా అరచేతిని గుండ్రగా తిప్పుతున్నట్లుగా (సర్కులార్ మూవ్‌మెంట్స్‌తో) జరగాలి.
  • మంచి స్నానం ఆహ్లాదాన్ని ఇస్తుంది. స్నానం తర్వాత ఉండే ఆహ్లాదకరమైన అనుభూతిని ప్రయత్నపూర్వకంగా అనుభవించండి. ఆ ఫ్రెష్ ఫీలింగ్ కూడా మిమ్మల్ని మరికాస్త ఎక్కువ ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది.  

  • నిద్రపోయిన సమయం వల్ల మనం ఆహారం తీసుకోవడంలో చాలా సేపటి వరకు జరగదు. అందుకే నిద్ర లేవగానే తీసుకునే ఆహారం (బ్రేక్‌ఫాస్ట్) మోతాదు కాస్త ఎక్కువగా ఉన్నా పరవాలేదు. అయితే అది నూనె పదార్థాలతో చేసినది (పూరీల వంటిది) కాకుండా ఉండేలా వీలైనంత జాగ్రత్త తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌గా నూనె పదార్థాలు తిన్నా పరవాలేదుగాని... అది చాలాసేపటి వరకు మిమ్మల్ని మందకొడిగా ఉండేలా చేస్తుంది. పైగా రోజులో చురుగ్గా ఉండాల్సిన వ్యవధిని తగ్గిస్తుంది. ఇక రాత్రి భోజనంలో మాత్రం నూనె పదార్థాలు లేకుండా చూసుకోవాల్సిందే.
  • మీ ఆహారంలో ఎక్కువగా వేయించిన పదార్థాల కంటే ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోండి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి. కాయధాన్యాలతో ఉండే ఆహారాలు, నట్స్ మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మాంసాహారం తీసుకోవడం ఇష్టమైతే, దానితో పాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి.
  • మీరు ఆఫీస్‌లో తీసుకునే కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోండి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి.
  • మీరు టాయిలెట్‌కు వెళ్లాల్సిన సమయంలో మీ ఫ్లోర్‌లోనే ఉండేవాటిని కాకుండా మీ ఫ్లోర్‌కు పైన రెండు అంతస్తులపై ఉండే టాయిలెట్‌కు వెళ్లండి. దీనికోసం లిఫ్ట్ ఉపయోగించకండి. అప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా చేయకపోయినా మీ శరీరానికి కొంత వ్యాయామం దొరుకుతుంది.
  • మీరు రోజులో ఎక్కువసార్లు వీలైనంతగా నీళ్లు తాగండి. కొందరు బయటకు అంటే షాపింగ్‌కు గానీ, ఇతరత్రా టాయిలెట్ సౌకర్యం లేని ప్రదేశాలకు వెళ్లడానికి ముందు చాలాసేపు నీళ్లు తాగరు. దాని కంటే నీళ్లు తాగి, బయటకు బయలుదేరే ముందు టాయిలెట్‌కు వెళ్లిరావడం మంచిది. 
  • మీరు వెన్న, నెయ్యి వాడటం పూర్తిగా తగ్గించండి. ఇక మీ ఆహారంలో వాడే నూనెలకు బదులు ఆలివ్ ఆయిల్ ఉండేలా చూసుకోండి.
  • ఫూట్ జ్యూస్ తీసుకోడానికి బదులు తాజా పళ్లను తినండి.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top