వెలక్కాయ వడలు



కావల్సినవి:
వెలక్కాయ గుజ్జు - రెండు కప్పులు, పుట్నాలపప్పు - కప్పు, సెనగపప్పు - రెండు కప్పులు, మినప్పప్పు - కప్పు, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - ఐదు, ఉల్లిపాయలు - రెండు, నూనె - వేయించడానికి సరిపడా, జీలకర్ర - చెంచా, కొబ్బరి - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత.

తయారీ: అన్నిరకాల పప్పుల్ని రెండుమూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరవాత మెత్తగా రుబ్బుకుని అందులో వెలక్కాయ గుజ్జు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు చేర్చి.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వజ్రాకారంలో వడల్లా అద్దుకుని కాగుతున్న నూనెలో వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. వీటిని కొబ్బరి లేదా అల్లం చట్నీతో కలిపి తింటే ఆ రుచే వేరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top