కంప్యూటర్‌పై పనిచేస్తూ ఎప్పుడూ కనురెప్పలు ఆర్పకుండా చూసేవారికి కొన్ని చిట్కాలు

కంప్యూటర్‌పై పనిచేస్తూ ఎప్పుడూ కనురెప్పలు ఆర్పకుండా చూసేవారికి కన్నుపొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. వైద్యపరిభాషలో ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అనే ఈ సమస్యకు నివారణ ఇలా...
- కంటికి పొగ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొగాకు పొగ అస్సలు తగలనివ్వకూడదు.

- కంటిరెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా చూస్తూ ఉండటం సరికాదు.


- మనం చదువుతున్నప్పుడు సరైన వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకు సాధారణ వెలుతురులోనే చదవండి. ఫ్లోరెసెంట్ కాంతిలో ఎక్కువసేపు చదవద్దు.


- చదువుతున్నప్పుడు మధ్యమధ్య కాసేపు కంటికి విశ్రాంతినివ్వండి. చిన్న అక్షరాలను చాలాసేపు చదవద్దు. అలా చదవాల్సి వస్తే మధ్యమధ్యన వేరేవైపు కూడా చూపును ప్రసరిస్తూ ఉండండి. మనం చదవాల్సినదెప్పుడూ కంటి కంటే కిందనే ఉండాలి. పై వైపు చూస్తూ చదవాల్సి వస్తే అది కేవలం కాసేపే తప్ప... ఎప్పుడూ అలా ఉండేవాటిని చదువుతూ ఉండవద్దు. 
- టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్‌నే తదేకంగా చూడవద్దు. మధ్యమధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి.

- తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతిలో వెలుతురుకు ఎక్స్‌పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి.


- ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడును కాసేపు తీయండి.


- ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అవలంబించండి.


- కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్తు తుడుచుకోవద్దు.


- కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడక్కోవడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి.


- తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అంటే... అన్నిరకాల వైటమిన్లు (ఏ,బీ,సీ), ఖనిజాలు... ముఖ్యంగా జింక్ ఉండేలా చూసుకోండి.

 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top