చిగుళ్లూ, మధుమేహం... ఈ రెండింటి విషయంలో కొన్ని సూచనలు...

చిగుళ్ల వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అవి మధుమేహానికి దారితీస్తాయి. పైగా అవి మధుమేహాన్ని తీవ్రం చేస్తాయి. అందుకే చిగుళ్ల వ్యాధులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. పైగా చక్కెర వ్యాధిలాగే చిగుళ్ల వ్యాధులూ నొప్పి లేకుండా నిశ్శబ్దంగా వస్తాయి. చక్కెరలాగే దెబ్బతీస్తాయి. అందుకే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక మధుమేహం ఉన్నవారు చిగుళ్ల వ్యాధి రాకుండా చక్కెరను అదుపు చేసుకోవాలి. చిగుళ్లూ, మధుమేహం... ఈ రెండింటి విషయంలో కొన్ని సూచనలు...
 

- దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం గురించి డెంటిస్ట్‌ను కలిసినప్పుడు మీకున్న మధుమేహం సమస్య గురించి కూడా తెలియజేయండి. 
- చిగుళ్ల వ్యాధులు లేకపోతే మధుమేహం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ ఉంటే బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఒకసారి చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ మొదలైతే తగ్గడానికి దీర్ఘకాలం పడుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే దంతాలు వదులు అవడం, ఊడిపోవడం జరుగుతుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే చిగుళ్ల సమస్యలను నివారించుకోండి.

- దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. కట్టుడుపళ్ల కన్నా సహజసిద్ధమైన మన శాశ్వత దంతాలు ఆహారాన్ని నమలడానికి బాగా ఉపయోగపడతాయి. కట్టుడు పళ్లు అన్నిసార్లూ పూర్తి ఫిట్‌గా సెట్ అవ్వకపోవచ్చు. పైగా అవి కట్టుడు పళ్లే అన్న సంగతి మీరు గుర్తుంచుకోవడం వల్ల అవి మీ శరీర భాగాలే అని మీరు మానసికంగా పూర్తిగా అంగీకరించకపోవచ్చు.


- చాలా సందర్భాల్లో కట్టుడు పళ్లతో చిగుళ్ల నొప్పి, ఇన్ఫెక్షన్లు రావచ్చు. చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడితే ఎంత వయసు పెరిగినా పళ్లు ఊడిపోవని గుర్తుంచుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top