డయాబెటిస్‌తో వచ్చే భుజం నొప్పి తగ్గాలంటే...

మధుమేహం ఉన్న వారిలో ఈరకమైన నొప్పి సర్వసాధారణం. దీనినే పెరి-ఆర్థరైటిస్ లేదా క్యాప్సులైటిస్ అంటారు. ఈ కండిషన్‌లో అది మొదట భుజాలు కదలించడంలో ఇబ్బందితో మొదలై క్రమక్రమంగా భుజాన్ని ఏ మాత్రం కదిలించలేకపోవడం, చివర్న భుజాలు పూర్తిగా స్తంభించేంత నొప్పి కలిగే వరకు పరిస్థితి వెళ్తుంది. ఇలాంటి కండిషన్ ఉన్నవారు డయాబిటీస్‌ని ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఈ నొప్పి తగ్గి మాములు స్థితికి రావాలంటే 6-8 నెలలు పడుతుంది. అనుభవం లేని ఫిజియోథెరపిస్ట్‌లు చేతుల్ని వేగంగా కదిలించడం వల్ల ఒక్కోసారి నొప్పి తగ్గటానికి బదులు పెరిగే అవకాశలు ఉంటాయి. నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న కేసులలో ఆర్థోపెడిక్ సర్జెన్స్ అనస్థీషియా ఇచ్చి కీలును సరిచేస్తారు. కాని దీని వల్ల కొన్ని సార్లు లోపలి భాగాల్లో చిన్న ఫ్రాక్చర్లు కలుగవచ్చు. 

అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు...

  • నొప్పిగా ఉన్నప్పుడు భుజాన్ని ఎక్కువగా కదపకండి. అంటే కదలిక వల్ల నొప్పి కలగనంత వరకు మాత్రమే భుజాలను కదపండి.
  • నొప్పి తగ్గిన తరువాత 3 -4 వారాల పాటు తేలిక పాటి వ్యాయామాలు చేయండి.

  • కుర్చీలో కూర్చుని చేయి పక్కకు వేలాడదీసి నొప్పి లేకుండా నిదానంగా గుండ్రంగా తిప్పుతూ రెండు దిశలలో తిప్పుతూ వ్యాయామం చేయండి.

  • భుజాల కదలికలు ఫ్రీ అవుతున్న కొద్దీ వ్యాయామాన్ని పెంచండి.

  • రాత్రివేళ నొప్పిలేని వైపు ఒరిగి పడుకొండి. ముందుగా ఓ తలగడ పెట్టి... దానిపై మీ నొప్పి ఉన్న చేతిని ఆ తలగడపై ఆనించి పడుకొండి. దీని వల్ల పొద్దున్న మీకు నొప్పి ఉండదు.

  • టవల్‌ను వేడినీటిలో ముంచి, పిండి- కాపడం పెట్టడం, ఫిజియోథెరపీకి సంబంధించిన కొన్ని పద్ధతులను పాటించడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
  • మీ చేతులను పెకైత్తినప్పుడు మెడ కండరాలపై ఒత్తిడి పడనివ్వకండి. దానివల్ల మెడ నొప్పి కూడా కొని తెచ్చుకున్నవారవుతారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top