కాఫీపొడితో... దుర్వాసన మాయం!

పొడిగొట్టిన కాఫీ గింజలతో మీరు ఏమేం చేయగలరు? ఏముంది... ఘుమఘుమలాడే కాఫీ తప్ప అనుకుంటున్నారా? అక్కడే తప్పులో కాలేశారు మీరు. కుళ్లబెట్టి ఎరువుగా మార్చవచ్చు.. వాహనాలకు ఇంధనం, ప్రింటర్లకు అవసరమైన సిరా... ఇంకా చాలా చేయవచ్చు. వీటి సంగతి కాసేపు పక్కనబెడదాం. కాఫీ పొడితో మురుగునీటి కంపును కూడా కడిగేయవచ్చు. న్యూయార్క్‌లోని సిటీ కాలేజ్ శాస్త్రవేత్త థెరెసా బాండ్‌సోజ్ ఈ విషయాన్ని గుర్తించారు. మురుగునీటిని శుభ్రం చేస్తూ చాలామంది పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక, దుర్వాసన భరించలేక మరణించిన వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం.


ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు కాఫీ పొడి బాగా పనికొస్తుందని థెరెసా అంటున్నారు. మరీ ముఖ్యంగా కుళ్లిన కోడిగుడ్ల వాసన వెదజల్లే హైడ్రోజన్ సల్ఫైడ్ యాసిడ్ విషయంలో మరీ బాగా పనిచేస్తుందట ఇది. యాక్టివ్ కార్బన్ ఎలాగైతే నీటిలోని మలినాలను కడిగేస్తుందో అదేవిధంగా కాఫీపొడి హైడ్రోజన్ సల్ఫైడ్ ఆమ్లాన్ని పీల్చేసుకుంటుందని థెరెసా తెలిపారు. కాఫీపొడిలో ఉండే కెఫీన్‌లో నైట్రోజన్ ఉంటుందని ఇది కార్బన్ పదార్థం గాల్లోని సల్ఫర్‌ను ఎక్కువగా పీల్చుకునేలా చేస్తుందని వాడేసిన కాఫీపొడిని మురుగులో పడేయడం ఒక్కటే మనం చేయాల్సిన పని అని థెరెసా వివరించారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top