మన రాష్ట్రంలో ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది?

శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవిల్లి గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సూర్యనారాయణ స్వామి ముగ్గురు భార్యలు ‘ఉష, పద్మిని, ఛాయ’లతో కొలువుదీరి ఉన్నాడు. సప్తాశ్వాలు రథాన్ని లాగుతుండగా అనూరుడు రథాన్ని నడుపుతుండగా స్వామి రథారూఢుడై ఉంటాడు. ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామిగా ఇక్కడ సూర్యనారాయణ స్వామి కొలుపులు అందుకుంటున్నాడు. రథసప్తమి రోజు సూర్యకిరణాలు స్వామి పాదాల మీద పడతాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి ఈ రోజు అనేకమంది భక్తులు వస్తారు. ఇది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉంది. కాబట్టి బస్సు లేదా రైలు మార్గాన శ్రీకాకుళం చేరితే దాదాపుగా అరసవిల్లి చేరినట్లే. ఇక్కడ వసతి సదుపాయాలు ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top