కాఫీతో మధుమేహం దూరం!

రోజూ నాలుగు కప్పుల కాఫీ తాగితే మధుమేహం వచ్చే ముప్పు 30శాతం తగ్గుతుంద ట!యూరప్ నిపుణుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, కాఫీ తాగడం వల్ల కేన్సర్ వంటి తీవ్ర జబ్బులు వస్తాయన్న నివేదికలను కూడా ఈ బృందం తోసిపుచ్చింది. తగిన మోతాదులో కాఫీ సేవించడం అన్ని రకాలుగా మంచిదేనని తేల్చింది.

కాఫీ తాగే వారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువని.. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి జబ్బులు వచ్చే ముప్పు కూడా ఉండదని జర్మనీలోని పరిశోధనా సంస్థ 'ఎపిక్' ప్రకటించింది. ఇందుకోసం సుమారు 43వేల మందిపై తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

మరోవైపు అనేక రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఎలా పోగవుతుందో అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. కణాల మధ్య రక్త ప్రవాహాన్ని నియంత్రించే హెచ్ఆర్ఎస్ అనే ప్రొటీన్ ఇందుకు కారణమని న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. దీనిపై మరింత పరిశోధనల ద్వారా మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top