బీట్‌ రూట్‌ మసాలా కూర

కావలసినవి :

బీట్‌రూట్‌ 1/2 కిలో
ఉల్లిపాయలు 3
వెల్లుల్లి 2 రెబ్బలు
అల్లం చిన్నముక్క
గసగసాలు     2 స్పూన్లు 
దాల్చిన చెక్క  3 ముక్కలు
ధనియాలు   2 స్పూన్లు  
లవంగాలు   4
పసుపు     4 
ఉప్పుకారం,నూనె తగినంత
 
ఇలా చేయాలి
బీట్‌రూట్‌ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.ఉల్లిపాయలు ముద్దగా నూరాలి.
మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి కూడా మెత్తగా నూరి  ఉల్లిపాయ ముద్దలో కలిపేసుకోవాలి. 
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిమసాలా ముద్దవేసి బాగా వేపుకోవాలి. అది 
వేగుతున్నప్పుడే బీట్‌రూట్‌ ముక్కలు, పసుపు, ఉప్పు కారం కూడా వేసి ఒక్కసారి
మూతపెట్టి కాసేపు ఉంచాలి. తర్వాత మూత తీసి కొంచెం నీర పోసి కలిపి 
మూతపెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతూ సన్నసెగమీద ఉడకనివ్వాలి. ముక్క ఉడికాక 
నీరు ఇగిరాక దించాలి. మసాలా  ఘుమఘుమలతో బీట్‌రూట్‌ కూర చపాతీల్లోకి కూడా 
బాగుంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top