గోరు అందం కోసం కొన్ని టిప్స్ చూద్దాం.

  • గోళ్లు మరీ బలహీనంగా ఉంటే వాటిని నీళ్లతో తడిపి గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌లో రోజు విడిచి రోజు 20 నిమిషాల పాటు ఉంచితే బలంగా తయారవుతాయి.
  • మ్యానిక్యూర్ చేయించేప్పుడు ఒక్కోసారి బ్యుటీషియన్స్ గోటి క్యూటికిల్ కూడా తీసేస్తారు. ఇలా చేయడం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు రావచ్చు.
  • వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నెయిల్ పాలిష్ తీసేసి మళ్లీ వేసుకోవడం సరికాదు. అంటే... వారానికి ఒకసారి ఒక్క నెయిల్ పెయింట్ మాత్రమే వేసుకోవడం ఆరోగ్యకరం.
  • మీ గోళ్లకు స్వాభావికమైన మెరుపు రావాలంటే వాటిపై పెట్రోలియమ్ జెల్లీ పూసి, పాలిష్ చేసినట్లుగా ఒక పొడి గుడ్డతో బఫ్ చేయాలి.
  • గోళ్లకు సబ్బు తగిలి ఉంటే అవి పెళుసుగా మారిపోతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే, లేదా చేతులు శుభ్రం చేసుకున్న వెంటనే వాటికి తగిలి ఉన్న సబ్బు పోయేలా కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top