‘మూడ్‌’ సదరు వ్యక్తులు సరిగా ఉంచుకోవడం కొన్ని పద్ధతుల ద్వారా సాధ్యమే. వీటిని చదివి వదిలేయకుండా ‘మూడ్‌’ తెచ్చుకుని ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది సుమా!

లోకంలో మనుషులంతా ఒకే తీరున ఉండరు. ఇందుకు వారి స్వభావాలే కారణమైనా, మారే మానసిక స్థితిని ప్రతి బింబించే ‘మూడ్స్‌’ కూడా హేతువులే. నిన్నటి దాకా నవ్వుతూ మాట్లాడిన పక్కింటావిడ ఇవాళ ముఖం ముడుచుకుందన్నా, ఆఫీసులో బాస్‌ అకారణంగా తిట్టారన్నా, అత్తగారు అలిగిందన్నా, ఆడపడుచు మూతి ముడుచుకున్నా అంతా ‘మూడ్‌’ మహత్యమే! ఇలా రకరకాలుగా ఎదుటివారిని వేధించి బాధించే ‘మూడ్‌’ సదరు వ్యక్తులు సరిగా ఉంచుకోవడం కొన్ని పద్ధతుల ద్వారా సాధ్యమే. వీటిని చదివి వదిలేయకుండా ‘మూడ్‌’ తెచ్చుకుని ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది సుమా! 

  • రోజువారీ కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇక నిద్రపోవడమే మిగిలింది. ఇప్పుడు విశ్రాంతిగా కూర్చొని మీ ‘మూడ్‌ ఎలా ఉందో ఆలోచించాలి. ఆపై రోజంతా మీ ప్రవర్తన ఎలా ఉందో, చెప్పుకో దగ్గ మార్పు ఉందేమో గుర్తుకు తెచ్చుకోండి. ఫలి తాలు సమీక్షించుకోండి. మంచివి అనుకున్న ఆలో చనలు నోట్‌ చేసుకోండి. ఈ పద్ధతి రోజూ కొన సాగించండి.
  • ఉదయం లేచిన దగ్గర్నించి మీ ‘మూడ్‌’ ఎన్ని రకాలుగా మారిందో ఆలోచించండి. ఎన్నిసార్లు, ఎలా మారిందో వివరంగా రాసుకోండి. ఈ క్రమం లో వర్ణనలకు తావీయక ఉన్నదున్నట్లు రాయండి.
  • ఇతరులతో మాట్లాడాలన్నా, పార్టీలు, ఫంక్షన్లలో కలిసిపోవాలన్నా ఇబ్బంది ఎదుర్కొంటున్నార నుకుందాం. ఇలాంటప్పుడు మీలాగే ఫీలవుతూ ఒంటరిగా, ఎవరితో కలవకుండా ఉన్న వ్యక్తుల్ని గమనించి పలకరించండి. ఈ సంభాషణ కూడా చాలా క్లుప్తంగా, సరళంగా ఉండాలి.
  • ఇష్టంలేని దృశ్యాలను, వ్యక్తులను ఊహించు కోవాలి. ఆ సమయాలు నిజంగా ఎదుర్కొంటు న్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ప్రవర్తించి, ఈ ఆలోచనలన్నీ కాగితంపై పెట్టండి. ఒకవేళ మీ ప్రవర్తన వల్లే వారావిధంగా ప్రవర్తిస్తున్నారేమో ఆలో చించండి. పరిష్కారంగా మీకిష్టం లేని వ్యక్తులతో స్నేహంగా మెలగి చూడండి.
  • మంచి ‘మూడ్‌’కు మంచి ఆహారం కూడా అవసర మే. ఇంటికి అతిథులొస్తే రుచికరమైన పదార్థాలు ఎలా వండి వడ్డిస్తారో అలాగే మీకూ చేసుకోడి (ఒక్క రే ఉన్నా సరే) ఇష్టమైన వంటకాలతో హాయిగా భోం చేసేయండి. మనసునూ, శరీరాన్ని ఉల్లాసకరమైన ‘మూడ్‌’లోకి తెచ్చేందుకిది ఎంతో తోడ్పడుతుంది.
  • ఒక రోజంతా ఎవరినీ లేదా ఏ విషయాన్ని విమ ర్శించకుండా ఉండగలరేమో ప్రయత్నించండి. ఎప్పుడూ వాడనలతో పొద్దుపుచ్చే వారికి ఇది కొం చెం ఇబ్బంది అయినా అసాధ్యం కాదు.
  • కుంచె, రంగులు తీసుకోండి. స్కెచ్‌ పెన్నులయినా ఫర్వాలేదు. కాగితంపై మీకు నచ్చిన విధంగా రం గులు పులమండి. ఇష్టంలేని రూపం, దానితో మీ సంబంధం బొమ్మల్లో చిత్రీకరించడానికి ప్రయత్నిం చండి. పక్కనే మీలో ఉన్న వ్యతిరేక భావాన్ని చూపు తూ మరో బొమ్మ వేయండి. ఇలా చెయ్యడం వల్ల అంతకుముందున్న భయం, ఉద్రేకం పోతాయి.
  • మనకు ఎవరి మీదనైనా పట్టరాని కోపం వచ్చి, ఆ వ్యక్తిని చంపాలన్నంత ఆవేశంలో ఉంటే గోడనో దిండునో పట్టి, కొట్టి కసితీర్చుకుంటాం. ఇలా దిం డుని కొట్టడం మంచిదే కాని ఓదార్పుకు పక్కన దగ్గరి స్నేహితులుంటే ఇంకా మంచిది.
  • మీ మనోభావాలను దెబ్బతీసి కోపం వచ్చేందుకు కారణమైన వారి గురించిన ఆలోచన లకు అక్షర రూపం ఇవ్వడం మంచిది. రెండ్రోజు లు పోయాక రాసిన దాన్ని మరల చదువుకోండి. ఆశ్చర్యంగా అప్పటికి మీ కోపం చల్లారడమే కాదు. ఉత్తరం పోస్టు చేయాలని కూడా అనిపించదు.
  • శరీరాన్ని పెంచుకోండి, వ్యాయామానికి, నడకకు ఎంత సమయం కేటాయిస్తున్నారో, ఎంత తరచుగా చేస్తున్నారో ఆలోచించుకోండి. శారీరకారోగ్యం బాగుంటే మానసికార్యోగమూ మెరుగుపడుతుంది. మూడ్స్‌ బాగుంటాయి. ప్రయత్నిస్తారు కదూ!
  •  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top