భద్రాచలానికి 40 కి.మీ దూరంలో పర్ణశాల ఉంది. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్న
దివ్యక్షేత్రం. సీతారాములు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ నివసించారని
చెబుతారు. ఈ ప్రాంగణంలో సీతాదేవి, ఆమెను ఎత్తుకెళ్లడానికి జంగందేవర వేషంలో
వచ్చిన రావణుని మూర్తులు ఉన్నాయి. సీతమ్మవారి పాదాలు, బంగారులేడి విగ్రహాలు
దర్శనమిస్తాయి. పర్ణశాల సమీపంలో రథగుట్ట ఉంది. దానిని రావణాసురుడు రథాన్ని
ఆపిన ప్రదేశం అంటారు. పర్ణశాలకు దగ్గరలో శబరివాగు ఉన్నాయి. శ్రీరాముని
అనుగ్రహంతో శబరి నదిగా మారిందంటారు. ఈ ప్రవాహం మధ్యలో చిన్న గుట్ట ఉంది.
దానిని సీతమ్మ స్నానం చేయడానికి కూర్చున్న ప్రదేశం అని చెబుతారు. ఇక్కడ ఆరు
అడుగుల పొడవు, ఏడు అడుగుల వెడల్పుతో నల్లని చార ఉంటుంది. దీనిని సీతాదేవి
చీర ఆరవేసిన ప్రదేశంగా భావిస్తారు.
ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం పర్ణశాల ఎక్కడ ఉంది?
teluguLifestyle Editor
10:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.