స్విట్జర్లాండ్ అసలు ఎలా పుట్టిందో తెలుసా ?


స్విట్జర్లాండ్ చుట్టూ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పశువుల కాపరులు ఏడాదిలో కొద్ది నెలలు సమీపంలో ఉన్న గోథాడ్ కొండ దగ్గరకు వచ్చేవాళ్లు. ఇక్కడ పచ్చిక బయళ్లలో పశువులను మేపుకుని వాళ్ల దేశాల్లో పచ్చదనం చేకూరే సమయానికి తిరిగి వెళ్లేవాళ్లు. కొన్నేళ్ల తర్వాత, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతే బావుంటుందని స్థిరపడిన వారితో ఏర్పడిన దేశం ఇది.

ఇక్కడ ప్రైవేట్ లైఫ్‌కి ఎక్కువ విలువ ఇస్తారు. మన స్వేచ్ఛ మరొకరి జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు - అనే సూత్రం బాగా అమలవుతుంది. మన ఇంట్లో టీవీ, రేడియోలాంటివి పక్క వాళ్లకు ఇబ్బంది కలిగించే స్థాయిలో హైవాల్యూమ్ పెట్టరాదు. పెద్ద సౌండ్‌తో వినాలంటే పబ్‌కు వెళ్లాలి.



మనం ఉగాది పండుగ చేసుకున్నట్లు ఇక్కడ ఏప్రిల్ నెలలో ‘సెజ్‌లాటెన్’ వేడుకను జరుపుకుంటారు. ఆగస్టులో అతిపెద్ద సాంకేతిక సమ్మేళనం స్ట్రీట్ పెరేడ్ జరుగుతుంది. వీటితోపాటు ఏటా జూన్ లేదా జూలైలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో సంగీత కచేరీలు, నాటికలు, రకరకాల నాట్యరీతులు ప్రదర్శితమవుతాయి.

హైదరాబాద్ నుంచి జ్యూరిక్ వెళ్లిరావడానికి విమాన చార్జీలు ఎకానమీ క్లాస్‌లో 55 వేల రూపాయలు అవుతాయి. ముంబయిలో విమానం మారాలి. జర్నీటైమ్ పదిగంటలు, విరామంతో కలిపి 16 - 18 గంటలవుతుంది. ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా, స్విస్ ఎయిర్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top