కొన్ని రకాల చిన్న జాగ్రత్తలు పాటించటం ద్వారా వేసవిలో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చు.

  • ఇంట్లో నీరు వృథాగా పోకుండా పైపులైన్‌లను మరమ్మతులు చేయించు కోవటంతోపాటు నీటి వినియోగంలో మన అలవాట్లను మార్చుకోవటం ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవచ్చు.
  •  సాధారణంగా మన ఇళ్లల్లోని ట్యాంకు ద్వారా నీరు చాలా వృథాగా పోతుంటుంది. మనం బ్రష్ చేసుకునేటపుడు ట్యాప్‌ను వదిలి వేస్తుంటాం. ప్లేట్లు కడుక్కునేటపుడు కూడా ట్యాప్‌ను వదలటం వల్ల నీరు వృథా అవుతుంటుంది. ట్యాప్‌ను అవసరమైనపుడే ఒపెన్ చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు.
  •  మన ట్యాప్‌లు వదులుగా వదలటం వల్ల, లూజ్ కనెక్షన్‌ల వల్ల నీరు లీక్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఎంతో నీరు వృథాగా పోతుంటుంది. ట్యాప్‌ను గట్టిగా కట్టివేయటంతోపాటు లీక్‌లు లేకుండా చూసుకుంటే మంచిది.
  • వాషింగ్ మెషీన్‌లకు ఎక్కువ నీరు అవసరముంటుంది. నీటి కొరత ఉందని బట్టలు ఉతకటానికి వాషింగ్‌మెషీన్ వాడకుండా ఉండలేం. మనం రెగ్యులర్‌గా ధరించే వస్త్రాలను వాషింగ్ మెషీన్‌లో వేసేటపుడు తక్కువ వాషింగ్ పౌడరుతోపాటు లో పవర్ వాషింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే నీటి వృథాను నివారించవచ్చు.
  • మీ కిచెన్ సింక్‌ను శుభ్రంగా ఉంచుకోండి. సింక్‌లో వ్యర్థ పదార్థాలు పేరుకుంటే దాన్ని శుభ్రం చేసేందుకు ఎక్కువ నీరు అవసరమవుతుంది. అలా అధిక నీరు అవసరం కాకుండా చూసుకోండి.
  • ఇంట్లోని వంటపాత్రలు కడిగేటపుడు ట్యాప్ కింద పెడితే అధిక నీరు అవసరమవుతుంది. ఓ బేసిన్‌లో నీరు పోసి, అందులో వంటపాత్రలు వేసి శుభ్రం చేయటం వల్ల నీటిని ఆదా చేయవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top