కొందకోనాలు... జలపాతాలు... పుణ్యక్షేత్రాలు... వెరసి ఓ చిరు ఇంద్రలోకం.. చిక్‌మగళూరు
11:02:00 AM
చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది.
చిక్‌మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన
రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు
అని పేరు వచ్చిందని చెబుతారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద
చిక్‌మగళూరుకు 5 కిమీ దూరంలో హిరెమగళూరు కూడా ఉండడం విశేషం.
ఈ జలపాతం బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గరలో ఉన్నది. ఈ జలపాతం
పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత
అనందాన్ని కలిగిస్తుంటుంది.
Share to other apps