మీకొచ్చే కలల వెనుక కారణాలను తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి...

ఉలిక్కిపడి నిద్రలేచేలా చేసే పీడకలలు, రోజుల తరబడి వెంటాడే విచిత్ర స్వప్నాలు... వీటి గురించి డ్రీమ్‌డోజ్.కామ్ (dreamdoze.com)శాస్త్రీయమైన విశ్లేషణ ఇస్తుంది. ఈ సైట్‌లోకి లాగిన్ అయ్యి, మిమ్మల్ని తరచూ పలకరించే స్వప్నం గురించి వివరిస్తే చాలు, ఆ కల గురించి, మీ మానసికస్థితి గురించి అనేక విశ్లేషణ పూర్వక వివరణలు అందుకోవచ్చు. మీ స్వప్నాల గురించి మానసిక శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులు రకరకాల రిఫరెన్సులతో రివ్యూలు రాస్తారని ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు అంటున్నారు.

ఎన్నిరకాల కలలు ఉంటాయి, నిద్రలో వచ్చే అస్పష్ట స్వప్నాలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, కలలపై దినచర్యల ప్రభావం, భయంకరమైన స్వప్నాలు రాకుండా చేసుకోవడం ఎలా....వంటి వాటి గురించిన పరిష్కారమార్గాలు, లోతైన విశ్లేషణలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. విశ్లేషణ కర్తలు అనేక శాస్త్రాల, వైద్య విధానాలను ఆధారంగా చేసుకొని వివరించడం ఈ సైట్ ప్రాముఖ్యత పెంచుతుంది. మరి మీకొచ్చే కలల వెనుక కారణాలను తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top