పిల్లలు ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర మనస్తత్వంతో ఎదగడానికి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు.

పిల్లలు ఉన్నతంగా ఎదగడం వెనుక తల్లిదండ్రుల కృషి చాలా ఉంటుంది. తమ బిడ్డలను తాము ఇతరుల కన్నా భిన్నంగా, ఎంతో ఆప్యాయంగా పెంచుతున్నామని చాలామంది భావిస్తుంటారు. అయితే తాము గారాబంగా పెంచుతున్నామా లేక ఆత్మీయతలను పంచుతున్నామా అన్న విషయంలో చాలామందికి గందరగోళం ఉంటుంది. పిల్లలు ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర మనస్తత్వంతో ఎదగడానికి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు.

* పిల్లలు జీవితాంతం అలాగే చిన్నవాళ్లుగానే వుండిపోరన్న విషయం ప్రతి తల్లిదండ్రులు ముందుగా గుర్తెరగాలి. కాలం గిర్రున తిరిగి పోతున్న కొద్దీ వాళ్లూ తొందరగానే పెద్దవాళ్లయిపోతారు. అందువల్ల పిల్లల బాల్యాన్ని తల్లిదండ్రులు కూడా ఎంజాయ్ చేయాలి. పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. వారితో ఎక్కువ సమయం గడపాలి.

 * పిల్లలు దేని కోసమైనా మారాం చేస్తుంటే వారిని కసురుకోకుండా, వారిపై చిరాకుపడకుండా వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించేందుకు ప్రయత్నించండి. ఒక్కసారి మీ బాల్యాన్ని గుర్తు చేసుకోండి.
 * పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరచండి. చిప్స్, పిజ్జా లాంటివి కాకుండా పండ్లు ఇవ్వండి. చిన్ననాటి నుంచి మంచి ఆహారపు అలవాట్లు ఏర్పడితే అవి పెద్దయినా కొనసాగుతాయి. పిల్లలు మారాం చేస్తున్నారని పదేపదే ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకులు కొనివ్వకండి.
 * ప్రతిరోజు ఏదో ఒక పూట పిల్లలతో కలసి భోజనం చేసే పద్ధతిని పాటించాలి. భోజనాల వేళ కుటుంబ పెద్ద ఉంటే పిల్లలలో భోజనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాళ్ల ఇష్టాఇష్టాలు తెలుసుకునే అవకాశం కూడా ఇక్కడే లభిస్తుంది. 
* పిల్లలు స్వతంత్రంగా, తమ సొంత వ్యక్తిత్వంతో ఎదగడానికి పెద్దలు కూడా తోడ్పడాలి. ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల మీద వారు ఆధారపడకుండా వాళ్లను పెంచాలి. వారు చేయగల పనులను వాళ్లే చేసుకునేలా ప్రోత్సహించాలి. తమ స్టడీ రూమ్‌ను శుభ్రపరుచుకోవడం, దుస్తులు మడతపెట్టుకోవడం, పక్కనే ఉండే దుకాణానికి వెళ్లి తేలికపాటి వస్తువులు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులను పిల్లలనే చేయనివ్వండి. దీని వల్ల వారికి కనీస లోకజ్ఞానం అలవడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top