పోపుల డబ్బాలో ఆరోగ్య రహస్యాలు

అల్లం: 
నోటికి రుచి తెలియకున్నా, ముక్కువాసన గుర్తిం చలేక పోయినా చిన్న అల్లంముక్కను పైతోలు తీసేసి పచ్చిది నమిలి మింగి నీరు తాగితే చాలు..
టొమాటో: 

టొమాటో రసంలో కొంచెం పసుపుకలిపి తా గితే ఇస్నోఫిలియాను నివారించవచ్చు.ప్రతి రోజు టొ మాటో రసంలో తెనె కలిపి సేవిస్తే రక్త శుద్ధి జరిగి చర్మ వ్యాధులు దరిచేరవు. 
పసుపు: 
 పసుపు నీరు,సున్నం,గుడ్డులోని తెల్ల సొన, వాముపొడి సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కండరాల నొప్పులకు, బెణుకులుకు పైపూత రాస్తే తగ్గిపోతాయి. ఒక చెంచా మెత్తని పసుపుతో పాలమీది మీగడ, గంధం పొడి,శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే నిగనిగలాడుతుంది. 
జీలకర్ర: 
 భోజనం తరువాత జీలకర్ర నమిలితే దంతాలు పుచ్చిపోకుండా ఉండటమే కాకుండా అజీర్తి, మలబద్దకం తగ్గిపోతాయి. జీలకర్ర,పసుపు, గంధం సమపాళ్లలో కలిపి మొత్తగా నూరి రోజూ ముఖానికి రాసుకుంటే అందమైన మార్పును మీరే గమనించవచ్చు. 
ఆవాలు: 
 చిటపటలాడే అవాలకు అనేక ఔషధ గుణాలున్నాయి. పంటి నొప్పి ఉన్న వాళ్లు కొద్దిగా అవాలు నమిలితే నొప్పి తగ్గుతుంది. అవాలు మెత్తగా నూరి గజ్జి, తామరకు పైపూతగా రాస్తే త్వరగా తగ్గిపోతాయి. 
వెల్లుల్లి:
 పాదాలకు ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి బాధ పెడుతుంటే వెల్లుల్లి రెబ్బను చిదిమి దాన్ని ఫంగస్‌ ఉన్నప్రాం తంలో రాసి అరగంట తరువాత కడగాలి. ఈ విధంగా పది రోజులు చేస్తే ఫంగస్‌ మటాష్‌.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top