ప్రతిరోజూ ఒక కమలాపండు తినడం వల్ల జీర్ణశక్తి బాగుండి శరీరానికి సి విటమెన్
 బాగా అందుతుందని అందరికీ తెలుసు. కమలా తొనలు తినడం, జ్యూస్‌లు తాగడంతో 
పాటు కమలాపండు సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. 
- కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసుకుని పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల పొడిలో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకోవాలి.
 
- ఓ పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే మురికిపోయి తాజాగా కనిపిస్తుంది.
 
- ఫేస్‌ప్యాక్‌లలో కూడా ఒక టీ స్పూను కమలాతొక్కల పొడి కలుపుకుంటే మచ్చలు వంటివి పోతాయి.
 
- కమలాపండు తొక్కలు తీసిన వెంటనే పాడేయకుండా వాటితో మోచేతులపై మసాజ్ చేసుకుంటే చర్మం మెత్తబడి నున్నగా కనిపిస్తుంది.
 

