సాధారణంగా వచ్చే తలనొప్పుల్లో రకాలను పరిశీలిస్తే...

మైగ్రేన్ నరాలకు సంబంధించిన తలనొప్పి. ఇది జన్యుపరంగా కలిగే అవకాశమూ ఉంది. దీనిని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ రకమైన తలనొప్పి ఎక్కువ మందిలో తలలో ఒక భాగంలోనూ కొద్దిమందిలో తలంతానూ వస్తుంది.

తలనొప్పి బాధించినంతగా మరే సమస్యా బాధించదు అంటే అతిశయోక్తి కాదు. పురుషుల్లో 90 శాతం మంది స్త్రీలలో 95 శాతం మంది తలనొప్పి బారిన పడుతుంటారు. సాధారణంగా వచ్చే తలనొప్పుల్లో రకాలను పరిశీలిస్తే...

మైగ్రేన్:

  మైగ్రేన్ నరాలకు సంబంధించిన తలనొప్పి. ఇది జన్యుపరంగా కలిగే అవకాశమూ ఉంది. దీనిని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ రకమైన తలనొప్పి ఎక్కువ మందిలో తలలో ఒక భాగంలోనూ కొద్దిమందిలో తలంతానూ వస్తుంది. ఇది చెవి దగ్గర మొదలై తల మధ్యకు చేరుతుంది, నాడి కొట్టుకుంటున్నట్లు వస్తూ పోతూ ఉంటుంది.

కడుపులో తిప్పి వాంతి కావడం, శబ్దం, కాంతి భరించలేకపోవడం, రకరకాల కాంతి కనిపించడం, కాళ్లు, చేతులు, నాలుక, పెదవులు తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవించవచ్చు. దీనిని ఆరా అంటాం. ఇది 30 శాతం మందిలోనే కనిపిస్తుంది. 70శాతం మందికి ఆరా లక్షణాలుండవు. ఆరా వస్తే మెదడుకు అపాయం సంభవించడానికి అవకాశాలు ఎక్కువ.

మైగ్రేన్ ట్రిగ్గర్స్:

మైగ్రేన్‌తో బాధపడుతున్న 85శాతంమందిలో ట్రిగ్గర్ కారణంగా మైగ్రేన్ రావడాన్ని చూస్తుంటాం. ఎండలో తిరగడం, ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనం బారిన పడడం, బాగా అలసిపోవడం, పగటి ప్రయాణం కారణంగా వస్తుంటుంది. చాక్‌లెట్‌లు, ఐస్‌క్రీములు, రెడ్‌వైన్ వంటివి ఈ తలనొప్పిని తీవ్రతరం చేస్తాయి. బహిష్టు సమయంలో మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ కావచ్చు. దృష్టిపరమైన సమస్యల వల్ల కంటిలోనూ,కంటి చుట్టూ నొప్పి కలిగి తలనొప్పికి దారి తీసే అవకాశం ఉంది. చూపు మందగించడం, రెండుగా కనిపించడం వంటి పరిణామాలు సంభవించవచ్చు. ఎక్కువసేపు చదవడం, కంప్యూటర్ వాడకం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి ఎక్కువ కావచ్చు.

సైనసైటిస్:
  సైనస్ సమస్య కలిగినప్పుడు తలభారంగా ఉండడం, తలనొప్పి రావడం, జలుబు, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, జ్వరం వంటి సమస్యలు కలగవచ్చు.

క్లస్టర్ హెడేక్: 

 ఇది 30-50 ఏళ్ల మధ్యలో ముఖ్యంగా మగవాళ్లలోనూ కనిపిస్తుంది. తలనొప్పి అరగంట నుంచి రెండు గంటల సేపు ఉంటుంది. ఎక్కువగా రాత్రి పూట బాధిస్తుంది. కంటిలోపల, కంటి చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. కనురెప్ప తెరవడం కష్టమవుతుంది. కళ్లు ఎర్రగా మారి నీళ్లు కారతాయి. ముక్కు మూసుకుపోయి నీరుకారుతుంది. మద్యం తీసుకునే వారిలో ఈ సమస్య కలిగే అవకాశం ఎక్కువ. ఏటా ఒకే సమయంలో వస్తుంటుంది.

సైకోటిక్ హెడేక్:

  మధ్య వయసు వారిలో వస్తుంది. నొప్పి ఒక చోట వస్తుంది. నిద్రలేమి, తరచుగా ఏడవడం, బరువు తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలుంటాయి. మెదడులో కంతుల వల్ల వచ్చే తలనొప్పి డల్‌గా ఉంటుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు మెనింజైటిస్,ఎన్‌కెఫలైటిస్ వంటి వ్యాధులలో కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది.
  

టెన్షన్ హెడేక్: 
 ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. తలచుట్టూ లేదా తలపైన భాగంలో నొక్కుతున్నట్లు నొప్పి వస్తుంది. తల చుట్టూ ఏదో గట్టిగా కట్టిన భావన కలుగుతుంది. టెన్షన్ కారణంగా తల, మెడ భాగంలో ఉన్న కండరాలు బిగుసుకుపోవడం ఈ నొప్పికి ఒక కారణం. ఒత్తిడితోపాటు నిద్రలేమి, ఎక్కువగా పని చేయడం, వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం, అతిగా మద్యపాన సేవనం, ఎక్కువ సేపు ఒకే వైపుకి పడుకోవడం వల్ల ఈ రకమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top