హెయిర్(జుట్టు) ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఆధునిక సర్జరీ

స్త్రీ,పురుషుల అందాన్ని పెంచేవి కేశాలు. ఇలాంటి కేశాలు జన్యుపరమైన లోపాలు, రక్తహీనత, ప్రోటీన్ లోపం తదితర కారణాల వల్ల రాలిపోతుంటాయి. పురుషులకు జుట్టు రాలి బట్టతల ఏర్పడుతుంటుంది. జుట్టు రాలిపోవటానికి కారణాలేవైనా విగ్, బాండింగ్, వీవింగ్ లాంటి కృత్రిమ పద్ధతుల్లో కాకుండా ఆధునిక సర్జరీ ద్వారా జుట్టును మొలిపించవ చ్చు.


హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తల వెనుకభాగం నుంచి జుట్టును సేకరిస్తారు. దీనినే డోనార్ సైట్ అంటారు. తలకు వెనుక వైపు అంటే రెండు చెవుల వెనుక వైపు బట్టతల రావడం ఎప్పుడూ జరగదు. ఆ ప్రదేశం నుంచి సేకరించిన వెంట్రుకలను అవసరమైన చోట ఇంప్లాంట్ చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏ వయసులోనైనా చేయించుకోవచ్చు. డోనార్ సైట్ నుంచి జుట్టు తీసిన చోట మచ్చ పడుతుంది. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన కేశాల్లో 90 నుంచి 95 శాతం ఫాలిక్యులర్ యూనిట్స్ నిలుస్తాయి. ఐదు శాతం వెంట్రుకలు రాలతాయి. ఇలా నిలచిన వెంట్రుకలు మూడు నెలల తర్వాత మొదలై ఆరు నెలల వరకు పెరుగుతాయి. కాస్త ఆలస్యం అయినా తొమ్మిది నెలలకు చక్కటి ఫలితం కనిపిస్తుంది.
ఆపరేషన్‌కు ఎలా సిద్ధం చేస్తారు?
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సర్జరీ చేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత మీ పూర్తి ఇష్టాన్ని సర్జన్‌కు తెలియ పర్చాలి. సర్జరీకి ముందు రోజు రాత్రి తల స్నానం చేయాలి. సాధారణ రక్త పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం, బీపీ వ్యాధులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.
హెయిర్ ఇంప్లాంట్ ఎలా చేస్తారు?
బట్టతల ఏర్పడు పద్ధతిని బట్టి జుట్టును నాటుతారు. తలమీద జుట్టు లేనపుడు, హెయిర్‌లైన్ డ్రాయింగ్ వేసి, ముందువరసలో ఒక్కొక్క పాలిక్యులార్ యూనిట్‌ను నాటుతూ వెనక్కు వెళ్లేకొద్దీ ఒక్కొక్క రంధ్రానికి రెండు, మూడు ఇంప్లాంట్ చేయవచ్చు. ముందు వరసలో దట్టంగా కుదుళ్లను ఇంప్లాంట్ చేస్తే నేచురల్ లుక్‌ను కోల్పోవలసి వస్తుంది. దువ్వినపుడు ముందు వరసలో ఒక్కొక్కటిగా ఇంప్లాంట్ చేసి సహజంగా కనబడేటట్లు చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో సింగిల్ యూనిట్ మెగా సెషన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చింది.

ఇందులో 7-8 గంటల ఒకే సిట్టింగ్‌లో 2,500-3,500 ఫాలిక్యులార్ యూనిట్లు నాటవచ్చు. డోనార్ సైట్ నుంచి జుట్టు తీయడంలో కూడా మునిపటిలా ఒక స్ట్రిప్‌లాగా తీయకుండా ఒక్కొక్క వెంట్రుకనే ఫాలికల్‌తోఆటు తీసి అలాగే నాటవచ్చు. ఈ పద్ధతిలో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ద్వారా మరింత నేచురల్ అప్పియరెన్స్‌ను తీసుకురావచ్చు. ఒకే చోట రెండు, మూడు వెంట్రుకలను కాక మొత్తం ఒక్కొటొక్కటిగానే ఇంప్లాంట్ చేస్తారు. ఇప్పుడు తల వెనుక మచ్చ మీద కూడా వెంట్రుకలు వచ్చే పద్ధతి (ట్రైకోఫైటిక్) ద్వారా చేస్తున్నాము. హెయిర్ ఫాలకల్ కల్చర్ విధానం పరిశోధన దశలో ఉంది. ఈ విధానంలో రోగి నుంచి కొన్ని వెంట్రుకలను తీసుకొని వాటిని కల్చర్ చేసి ఎక్కువ వెంట్రుకలను తయారు చేస్తారు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతి
- అవుట్ పేషంట్‌గానే హెయిర్ ఇంప్లాంట్ చేయించుకొని ఇంటికి వెళ్లవచ్చు.

- లోకల్ ఎనస్తీషియా ఇచ్చి ఈ సర్జరీ చేస్తారు.

- బట్టతల తీవ్రతను బట్టి ఎన్ని సిట్టింగ్స్‌లో పూర్తి చేయాలన్నది నిర్ణయిస్తారు. అలాగే ఎంతమేర ఇంప్లాంట్ చేయించుకోవాలనే దానిని బట్టి కూడా ఉంటుంది.

- పేషంట్ ఒకే సిట్టింగ్‌లో పూర్తిస్థాయి ఇంప్లాంటేషన్ చేయాలని కోరినపుడు అలాగే చేయడం కూడా సాధ్యమే. వీటన్నింటి దృష్ట్యా సిట్టింగ్‌కు రెండు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

- సాధారణంగా 2000 గ్రాఫ్ట్స్, అంతకంటే ఎక్కువ కూడా ఇంప్లాంట్ చేయవచ్చు.

- ఈ సర్జరీ ఒకరిద్దరితో అయిపోదు. టీమ్‌వర్క్ చేయాలి. తల నుంచి వెంట్రుకలను తీయడం, తీసినవి ఇంప్లాంట్ చేసే లోపుగా ఆరిపోకుండా ఐస్‌కూల్డ్ సెలైన్‌లో భద్రపర్చడం, ఫాలికల్స్‌ను జాగ్రత్తగా విడదీయటం, ఇంప్లాంట్ చేయాల్సిన చోట డ్రాయింగ్, గాట్లు పెట్టడం, పేషంట్ తలమీద వాటిని ఇంప్లాంట్ చేయడం...ఇలా దశలవారీగా పని జరుగుతుంది.


- సర్జరీ తర్వాత ఒకరోజు మాత్రమే డ్రెసింగ్ ఉంటుంది.

- ఐదో రోజు తర్వాత మామూలుగానే తలస్నానం చేసుకోవచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత సాధారణంగా కటింగ్ చేయించుకోవచ్చు.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top