గుండెజబ్బు రాకుండా ఏం తినాలి?

సాధారణంగా ప్రతీ ఒక్కరికీ రోజూ 20 గ్రాముల ఫ్యాట్ అవసరం అవుతుంది. ఇది రోజూ వంట కోసం ఉపయోగించే నూనెలో లభిస్తుంది. దీంతో పాటు ఇతర ఆహార పదార్థాల్లో అదనంగా లభించే ఫ్యాట్‌ను తగ్గించుకోవడంపై దృష్టి సారించాలి. వంటనూనె ఒకే రకమైనది కాకుండా మార్చుకుంటుండాలి. ఒకసారి రైస్‌బ్రౌన్ అయిల్ తీసుకుంటే మరొకసారి గ్రౌండ్‌నట్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇలా మార్చుకుంటూ వాడుకోవాలి. వెల్లుల్లిలో యాంటిఅక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా కాపాడుతాయి. దీంతోపాటు వారంలో రెండు రోజులు చేపలు తినాలి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తుంది. ఇది రక్తనాళాలు ఆరోగ్యంగా, సాగేగుణం కలిగిఉండటానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో మోనో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి. గోధుమలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ కొలెస్ట్రాల్‌తో బైండ్ అయి శరీరం నుంచి బయటకు పంపించి వేస్తుంది. ఫైబర్ గోధుమలోనే కాకుండా ఓట్స్, బార్లీ, రాగి, జోవర్‌లలో కూడా సమృద్ధిగా లభిస్తుంది. వీటితో పాటు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పాల ఉత్పత్తులో ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ అక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ ఉంటాయి.


పాలిఫెనాల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలలో విటమిన్ బి కాంప్లెక్స్, నియాసిన్ ఉంటుంది. ఇది క్లాట్స్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఈ డైట్ ఫాలో కావడంతో రోజూ ఒక ఆపిల్ తినడం అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top