మనం నిత్యం వాడే వస్తువులతో అందం ...ఆరోగ్యం

పసుపు : పసుపును ఒక మొక్క తాలూకు వేళ్ల నుంచి తీస్తారు. పసుపుకొమ్ములుగా పేర్కొనే ఆ మొక్కల వేళ్లను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వంటలోనూ పసుపు వాడతారు. తెలుగువారి ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో కాళ్లకు పసుపు రాసుకునే సంప్రదాయం ఉంది. ఇది కీటక వినాశనిగా పనిచేస్తుంది. దానితోపాటు ముఖానికి కూడా సౌందర్యసాధనంగా పసుపు రాసుకుంటారు. అందువల్ల ముఖానికి మెరుగైన ఛాయ వస్తుంది. అయితే దీర్ఘకాలంపాటు పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దానివల్ల ముఖం తడి కోల్పోయి పొడిబారే అవకాశం ఉంది.

చందనం:
మన తెలుగు సంస్కృతిలోని ఎన్నో ఉత్సవాల్లో కాళ్లకు పసుపుతో పాటు... మెడపై గంధం రాసుకునే సంప్రదాయం కూడా ఉంది. అంటే సౌందర్య సాధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంస్కృతిలో అంతర్భాగంగా మారింది. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యంగా ఉపయోగించడంతో పాటు చలువచేసే సాధనంగా వాడతారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గంధాన్ని తయారుచేసి వాడతారు.ఇటీవల ఈ చందనాన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో, పెర్‌ఫ్యూమ్స్‌లో, సబ్బుల్లో ఉపయోగిస్తున్నారు. చందంతో ముఖానికి ప్యాక్ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే.

గోరింటాకు:

ఇటీవల మెహందీ పేరిట ప్రాచుర్యం పొందిన ఆకు నుంచి తీసే ఈ ఉత్పాదనను సౌందర్య సాధనంగా ఎప్పటినుంచో మన సంస్కృతిలో ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్ ఏజెంట్‌గా మాత్రమేగాక... చల్లదనాన్ని ఇచ్చే సౌందర్యసాధనంగా పేరుపొందింది. ఇటీవల దీన్ని తలకు వేసే రంగుల్లో ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లిసంబరాల్లో ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది ఒక సాంస్కృతిక వేడుక.

సాంబ్రాణి:

ఇది కొన్ని రసాయనాలతో పాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్నపిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఉపయోగిస్తారు. ప్రతిరోజూ చంటిపిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందులోంచి వచ్చే పొగ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. దానితోపాటు చంటిపిల్లలు ఉన్న గదిలో వచ్చే దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకునే హానికారక బ్యాక్టీరియాను దూరం చేస్తుందన్నమాట. 


కొబ్బరినూనె:
ఇది ముదిరిన కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంస్కృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే అది శ్రేష్ఠమైనదని నమ్మకం. దీనితో పాటు ఆరోగ్యకరమైన కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా మామూలే.

శనగపిండి:
ముఖానికి ఉన్న జిడ్డును తొలగించడానికి దీన్ని ఒక ప్యాక్‌లా వేసుకోవడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతి. దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా ముఖానికి రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో మేని ఛాయ మెరుగవుతుందన్నది విశ్వాసం. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top