మీ పిల్లలు ఇంకా పక్క తడుపుతున్నారా .....

సాధారణంగా చిన్నపిల్లలు 4-5 ఏళ్ల వయసు వచ్చేవరకూ నిద్రలో పక్క తడుపుతుంటారు. ఐదు ఏళ్ల తర్వాత కూడా కొందరికి ఈ అలవాటు మానదు. అప్పుడు దీనిని ఒక సమస్యగా పరిగణించవచ్చు. దానిని నాక్టర్నల్ ఎన్యూరీసిస్ అంటారు.

ఈ సమస్య రావడానికి కారణాలు:

జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్యంగా, నాడీ వ్యవస్థలో లోపాలు (వెన్నెముక లోపాలు), మూత్ర అవయవాలలో లోపాలు (స్పింక్టర్‌పై కంట్రోల్ సరిగ్గాలేని సందర్భాల్లో), ఇన్‌ఫెక్షన్స్, మానసిక ఒత్తిడి... వీటివల్ల ఈ సమస్య రావచ్చు. ఇది అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో ఎక్కువగా ఉంటుంది. మూత్రాశయ కండరాలు ఎక్కువగా సంకోచించడం వల్ల మూత్రాశయానికి మూత్రం నిలవ ఉంచే సామర్థ్యం తగ్గుతుంది. 

కొంతమందికి నిద్రలోనే కాకుండా పగటిపూట కూడా తెలియకుండా, మూత్రం పడిపోతుంది. దీనిని యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఇది సాధారణంగా నాడీవ్యవస్థలో లోపాలవల్ల గాని, ఇన్‌ఫెక్షన్స్‌వల్ల గాని వస్తుంది. ప్రధానంగా చిన్నతనంలో మాటలు, నడక త్వరగా రాని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

పిల్లలు గాఢనిద్రలో ఉండటం వల్ల, త్వరగా మేలుకోలేకపోవడం వల్ల పక్క తడపవచ్చు. దీనికి తోడు వీరి కడుపులో పురుగులు ఉండే అవకాశం ఉంది. నిద్రలో పళ్లు కొరుకుతుంటారు. నిపుణులైన హోమియో వైద్యుని సలహా మేరకు మందులు వాడితే దీనిని తేలికగా తగ్గించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top