ఫ్యాటీ లివర్ ( లివర్‌కు కొవ్వు పట్టడం )నివారణ కోసం మొదట చేయాల్సిందివే...

ఇటీవల ఫ్యాటీ లివర్ అనే సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. లివర్‌కు కొవ్వు పట్టడం అనే సమస్య ఆల్కహాల్ తీసుకునేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆల్కహాల్ అలవాటు లేనివారిలో కూడా ఈ సమస్య కనిపించవచ్చు. ఆల్కహాల్ అలవాటు లేనివారిలో ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తుంటే ఇంట్లోనే చిన్న జాగ్రత్తలతో వ్యాధి తీవ్రతరం కాకుండా చేసుకోవచు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... 

బరువు తగ్గండి: మీ ఎత్తుకు తగినట్లుగా మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. వారానికి అర కిలో కంటే ఎక్కువగా తగ్గడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఒకేసారి బరువు తగ్గడానికి ప్రయత్నించకండి. క్రమంగా తగ్గాలని గుర్తుంచుకోండి. 
బరువు తగ్గడం అన్నది మీ అంతట మీరు చేయలేకపోతుంటే డాక్టర్ సలహా తీసుకుని ఆహారం, వ్యాయామం పరిమితులు ఎంత ఉండాలో తెలుసుకోండి. 

హెల్దీ డైట్: మీరు తీసుకునే ఆహారంలో విధిగా కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. నెయ్యి వంటి కొవ్వు పదార్థాలు తీసుకోకుండా చేపలు, ఆలివ్ ఆయిల్ వంటివి వాడండి. పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా వాడండి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా తీసుకోండి. 

ఎక్సర్‌సైజ్: చురుగ్గా ఉండండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ చేయడానికి అవకాశం ఉన్న చోట్ల ఒంటికి పని చెప్పండి. అంటే ఎలివేటర్‌కు బదులు మెట్లు ఉపయోగించడం, కొద్దిపాటి దూరాలకు వాహనం ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాయామం మొదలుపెట్ట దలచుకున్నప్పుడు మొదట మీరు అవలంబించాలనుకున్న వ్యాయామాలను డాక్టర్ అనుమతించాకే మొదలుపెట్టండి. 

డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోండి. 




కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించుకోండి. దీనికి వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాల్సి ఉంటుంది.

దురలవాట్ల నుంచి దూరంగా ఉండండి: ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే దానికి దూరంగా ఉండండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడకండి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top