స్పోర్ట్స్ షూ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? చూడాల్సిన అంశాలేమిటి?

స్పోర్ట్స్ షూ కొనాలనుకున్నవారు ఏ బ్రాండ్ లేదా ఏ కంపెనీ షూస్ ఎంపిక చేసుకున్నా పరవాలేదు. పాదానికి సౌకర్యంగా ఉండటమే మంచి షూకు ప్రాతిపదిక. అందులో చూడాల్సిన అంశాలివి... 
మంచి మడమ (అది మరీ ఎత్తుగా కాకుండా కాలికి సౌకర్యంగా ఉండాలి) ముందు భాగం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. మన కాలిలో మడమ, ముందు కాళ్ల మధ్య భాగం ఆర్చ్‌లా వంగి ఉంటుంది. ఆ భాగం నేలకు ఆనదు. ఆ భాగానికి సపోర్ట్ దొరికేలా పాదరక్షలు ఉండాలి. పాదానికి తగినంత గాలి ఆడాలి. షూస్ తయారీకి ఉపయోగించిన మెటీరియల్ పాదానికి సౌకర్యంగా ఉండాలి. మీరు క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే స్పోర్ట్స్ షూ ఏడాది వరకు పనిచేయవచ్చు. 

అది మీరు వాడినా, వాడకపోయినా కనీసం ఏడాది నుంచి రెండేళ్ల పాటు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ రెండేళ్ల పాటు మీరు షూ వాడకుండా ఉంటే దాన్ని ఆ తర్వాత వాడటం అంత మంచిది కాదు. స్పోర్ట్స్‌లోని అనేక అవసరాల కోసం అనేక రకాల షూస్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... సాధారణ ఉపయోగం కోసం క్రాస్ ట్రైనింగ్ షూస్; రోడ్డుపై పరుగెత్తడానికి రన్నింగ్ షూస్; ఆడే ఆటను బట్టి కూడా షూ ప్రత్యేకంగా ఉంటుంది. మీ షూస్ చాలా ఎక్కువగా అరిగాయా లేక చిరిగాయా అన్న విషయాన్ని తరచూ పరిశీలించుకోవడం అవసరం. 

పాదాల ఆరోగ్యం కోసం మీరు కాళ్లను, షూస్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి ఉన్నవారికి స్పోర్ట్స్ షూస్‌తో మంచి ప్రయోజనం ఉంటుంది. కొందరికి పాదాల నిర్మాణంలో తేడాలు ఉండవచ్చు. అంటే... ఉండాల్సిన మన పాదంలో నేలకు ఆనకుండా ఆర్చిలా ఉండే భాగం కొందరిలో అంతగా ఆర్చిలాగ వంగకుండా ఉండటం లేదా మరింత ఎక్కువ వంగి ఉండటం సంభవించవచ్చు. అలాంటి వారు తమ పాదాల నిర్మాణానికి అనుగుణంగా షూలో మార్పులు (కరెక్షన్స్) చేయించుకోవడం అవసరం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top