ఔషధాల నిలయమైన మన పోపుల పెట్టె

మన భారతీయ సంప్రదాయ వంటగది కేవలం వండి వార్చడానికి పరిమితమైన నాలుగ్గోడల నిర్మాణం కాదు. ఇది అనేక ఔషధాల నిలయం. దేహంలో చోటు చేసుకునే ఎన్నో అనారోగ్యాలకు నివారణలు, చికిత్సలూ అన్నీ పోపుదినుసులతోనే చేయవచ్చు. ఔషధాల నిలయమైన మన పోపుల పెట్టె, పెరటితోటతో తగ్గించుకునే కొన్ని అనారోగ్య సమస్యలను తెలుసుకుందాం...

రోజూ క్రమంతప్పకుండా వెజిటబుల్ జ్యూస్ తాగితే అధిక బరువు తగ్గుతుంది. ఈ జ్యూస్‌ను తాజా ఆకు కూరలు, కూరగాయలు, పూలు, కాండం నుంచి గాని చేసుకోవచ్చు. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ అయిన తరువాత ఈ మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వేసి రసం పిండుకోవాలి. మార్కెట్‌లో కొన్న ఆకుకూరలు, కూరగాయలతో జ్యూస్ చేసుకునేటట్లయితే పురుగుమందుల ప్రభావం పోయే వరకు కడగాలి. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి ఆ నీటితో కడిగితే కూరగాయలు, పండ్ల పై పొరకు పట్టేసిన రసాయనాలు వదులుతాయి.

వెజిటబుల్, ఫ్లవర్ జ్యూస్‌ను ఉదయం ఒక టేబుల్ స్పూన్, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 

బరువు తగ్గాలనుకునే వాళ్లు... ఆహారం మోతాదు తగ్గించడం సాధ్యం కాకుంటే రోజూ ఆకుకూరలు తింటే ఫలితం ఉంటుంది. 

తరచుగా గొంతు నొప్పి తగ్గాలంటే... తులసి ఆకులను నీటిలో మరిగించి తాగాలి. నార్మల్ టీలో మరిగేటప్పుడు తులసి ఆకుని వేసుకోవచ్చు కూడ. 

గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు కలిపి రోజుకు రెండు- మూడుసార్లు గార్గిలింగ్ చేస్తే (గొంతులో పోసుకుని గరగరలాడించడం) గొంతు ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది పడిశం వదలకుండా ఇబ్బంది పెడుతుంటే గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగాలి. కఫంతో కూడిన దగ్గు బాధిస్తుంటే గోరువెచ్చని పాలలో చిటికెడు మిరియాల పొడి కలిపి రోజుకు రెండు లేదా మూడుసార్లు తాగాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top