అందని ద్రాక్ష పుల్లన...

కొందరు దేనికోసమైనా తీవ్రంగా ప్రయత్నించి, అది దొరక్కపోతే... దాన్ని తిడుతూ ఉంటారు. ఆ సందర్భంలో వాడే మాట ఇది. ఓ నక్క ఒక ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. పందిరికి చక్కటి ద్రాక్ష గుత్తులు వేళ్లాడుతూ కనిపించాయి. కానీ ఎంత ప్రయత్నించినా అది వాటిని అందుకోలేకపోయింది.

అయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి ఆయాసం వచ్చి చతికిలబడింది. ‘ఛీ ఛీ... నేనెందుకు అనసవరంగా కష్టపడటం. అయినా ద్రాక్షపళ్లు చాలా పుల్లగా ఉంటాయట. వాటిని తినాల్సిన ఖర్మ నాకేంటి’ అనుకుంటూ వెళ్లిపోయింది. ఇది ఓ జానపద కథ. దీన్నుంచే ఈ సామెత పుట్టింది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top