ఆపరేషన్ లేకుండా అందమైన శరీరాకృతి

అందమైన శరీరాకృతి కావాలంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు తీసేయాల్సిందే. కొవ్వు పోవాలంటే సర్జరీయే మార్గమా? ఒంటిపై గాటు పడాల్సిందేనా? అంటే అవసరం లేదంటున్నారు కాస్మెటిక్ వైద్యులు. నాన్ సర్జికల్ లైపోసక్షన్ విధానంలో సర్జరీ లేకుండా కొవ్వును కరిగించి అందమైన శరీరాకృతి వచ్చేలా చేయవచ్చంటున్నారు డాక్టర్ మోనారాజ్.

ఇటీవలి కాలంలో అందానికి ప్రాముఖ్యత పెరిగింది. ప్రతీ ఒక్కరూ ఆకర్షణీయంగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. అయితే ఒత్తిడి, పెరిగిన పోటీతత్వం, ఆహారపు అలవాట్లు అందంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటికితోడు శారీరక వ్యాయామం కొరవడటంతో బరువు పెరిగి శరీరాకృతి దెబ్బతింటోంది. పెరిగిన కొవ్వును తగ్గించుకోవడం కోసం, అందమైన శరీరాకృతిని పొందడం కోసం కాస్మెటిక్ సర్జరీల వెంట పరుగులు తీస్తున్నారు.

ఈ సర్జరీల వల్ల ప్రయోజనం ఉండకపోగా చర్మంపై మచ్చలు, గాట్లు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం నాన్ సర్జికల్ వెయిట్‌లాస్ ట్రీట్‌మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియక సర్జరీ చేయించుకుంటున్నారు. నాన్ సర్జికల్ ట్రీట్‌మెంట్ల వల్ల అదనపు బరువు తగ్గించుకోవడమే కాకుండా అందమైన శరీరాకృతిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ చికిత్సను నాన్ సర్జికల్ లైపోసక్షన్ అని అంటారు. ఈ మధ్యకాలంలో ఈ ట్రీట్‌మెంట్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది.


నాన్ సర్జికల్ లైపోసక్షన్
శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వు అధికంగా పేరుకుపోవడం మూలంగా శరీరాకృతి దెబ్బతింటుంది. డయాబెటిస్, అధికరక్తపోటు, స్ట్రోక్, అథెరోస్కెలెరోసిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి.

అధిక బరువును తగ్గించుకోవడం కోసం, అందమైన శరీరాకృతి కోసం చాలా మంది సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. ఇవి చాలా నొప్పి, బాధను కలిగిస్తాయి. ఈ సర్జరీకి ప్రత్యామ్నాయం నాన్ సర్జికల్ లైపోసక్షన్. సాధారణంగా ముఖం, నడుము, పిరుదులు, మెడ, బుగ్గలు, భుజాల కింద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగిస్తే శరీరం మళ్లీ పూర్వాకృతి సంతరించుకుంటుంది.
నిర్ధారణ
శరీరంలో కొవ్వు ఏ మేర పేరుకుపోయింది. నీటి శాతం ఎంత ఉంది? కండరాల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను బీసీఏ(బాడీ కంపోజిషన్ అనలైజర్) ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మెడికల్ హిస్టరీని పరిశీలించడం, పేషెంట్‌తో డిస్కస్ చేసి కొవ్వు తొలగించుకోవాలనుకుంటున్న ప్రదేశం ఫోటోలు, మెజర్‌మెంట్స్ తీయడం జరుగుతుంది. ఆ తరువాతే నాన్ లైపోసక్షన్‌కు అడ్వైజ్ చేయడం జరుగుతుంది.


చికిత్సా విధానం
ఏ భాగంలో కొవ్వును కరిగించాలో నిర్ధారించుకున్న తరువాత ఆ ప్రదేశంలోకి అల్ట్రాసౌండ్ వేవ్స్‌ని పంపించడం జరుగుతుంది. ముందుగా అల్ట్రాసోనిక్ జెల్ అప్లై చేసి లో ఫ్రీక్వెన్సీలో అల్ట్రాసోనిక్ వేవ్స్‌ని ఫ్యాట్ సెల్స్‌పైకి పంపించడం జరుగుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌లో రక్తనాళాలపై, నరాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. పూర్తిగా సురక్షితమైన ట్రీట్‌మెంట్ ఇది. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవాలని కోరుకునే వారికి ఇది ఉపయుక్తమైన ట్రీట్‌మెంట్.

వారంలో రెండు రోజులు ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా 10 నుంచి 15 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉన్నట్లయితే సులువుగా బరువు తగ్గుతారు. తక్కువ సిట్టింగ్స్‌లో ట్రీట్‌మెంట్ పూర్తవుతుంది. నొప్పి ఉండదు. శరీరంలో కుట్లు, గాట్లు ఏర్పడవు. ఎక్కువ కాలం తిరిగి ఫ్యాట్ ఏర్పడకుండా ఉంటుంది. చర్మం బిగుతుగా మారుతుంది. నిగారింపు సంతరించుకుంటుంది. లేజర్ ట్రీట్‌మెంట్, స్కిన్ ట్రీట్‌మెంట్ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆకర్షణీయ రూపం కోరుకునే వారు అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఫలితం బాగుంటుంది.
 

జాగ్ర త్తలు
నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనంతరం ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నియమబద్దంగా ఆహారం తీసుకోవాలి. మాంసాహారం తినకూడదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. డైటీషియన్ సూచించిన డైట్‌ను ఫాలో కావాలి. క్రమంతప్పకుండా వాకింగ్ చేయాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.


డా. మోనా రాజ్
ఎమ్మెస్సీ విత్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్
లితి స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్
డా. ఏ.ఎస్. రావు నగర్, ఈసీఐఎల్
హైదరాబాద్, ఫోన్స్ : 96 4021 4021,
040- 4021 4021 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top