మలబద్దకాన్ని తరిమి కొట్టాలంటే.....


పండ్లలో పీచుపదార్థం అధికంగా ఉండే బొప్పాయి, బత్తాయి, నారింజ, పనసపండు... మొదలైన వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

ముడిబియ్యం (దంపుడు బియ్యం), ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలు, ఆకు కూరల వంటివి తీసుకునే వారిలో మలబద్దకం సమస్య చాలా తక్కువ. బియ్యంతవుడు, గోధుమతవుడులలో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి మిగతా ఆహార పదార్థాలతో కలిపి రోజూ మూడు టీ స్పూన్ల తవుడు తీసుకుంటుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.

ప్రతిరోజూ రాత్రి రెండు చెంచాల మెంతులను నమలకుండా మింగాలి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మృదువిరేచనకారిగా పని చేస్తుంది. ప్రతిరోజూ రాత్రివేళల్లో గోరువెచ్చని నీటితో త్రిఫలాచూర్ణాన్ని (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమం) అరచెంచా నుంచి చెంచా వరకు వాడితే మంచిది. దీనిని దీర్ఘకాలం వాడడం మంచిది కాదు. మలవిసర్జన సహజస్థితికి వచ్చే వరకు వాడి కొంత విరామం తర్వాత మళ్లీ వాడాల్సి ఉంటుంది.

సునాముఖి (శెన్న) ఆకును చారు(రసం)లో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. పండ్లలో పీచుపదార్థం అధికంగా ఉండే బొప్పాయి, బత్తాయి, నారింజ, పనసపండు... మొదలైన వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఏదైనా ఒక ప్రక్రియను కనీసం 15 రోజులు ఆచరించాలి.
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top