నెలల వయసు నుంచి ఐదేళ్ల లోపు పిల్లల వరకు జలుబు సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

సీజన్ మారింది. జలుబు, దగ్గు సమస్యలతో పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. నెలల వయసు నుంచి ఐదేళ్ల లోపు పిల్లల వరకు జలుబు సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..


- జలుబు ఎక్కువగా ఉండి గాలి పీల్చుకోవడానికి కష్టపడుతుంటే, ఆహారం తీసుకోవడానికి, నిద్రపోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటే సెలైన్ డ్రాప్స్ రెండు చుక్కలు ముక్కులో వేయాలి. అవి కూడా నాలుగైదు రోజులకు మించి వాడకూడదు. 

- గాలిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు ఆవిరిపట్టాలి. వేడినీటిలో కొద్దిగా వేపరైజర్స్ వేసి ఆవిరి పట్టాలి. అయితే చంటి పిల్లలు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. పొగలు కక్కే వేడినీటికి మరీ దగ్గరగా తీసుకెళ్లకూడదు.

- ఆహారం విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. ముక్కు మూసుకుపోవడం వల్ల పిల్లలు సరిగా తినలేరు. అందుకని తక్కువ ఆహారాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఇస్తుండాలి. రెండు- మూడు గంటలకు ఓసారి పాలిచ్చే తల్లులు పిల్లలకు జలుబు ఉన్నప్పుడు ఎక్కువసార్లు ఇస్తుండాలి. 

- చలిగా ఉన్నప్పుడు శుభ్రమైన వెచ్చని ఉన్ని దుస్తులు వాడాలి. 

- చీమిడిని తొలగించడానికి ముక్కును గట్టిగా ఒత్తడం, రుద్దడం వంటివి చేయకూడదు. ముక్కు దగ్గరి చర్మం దెబ్బతినకుండా మెత్తని కాటన్ వస్త్రాన్ని ఉపయోగించాలి.

- సీజన్ మారుతున్నప్పుడు జలుబు రావడం సాధారణం. పిల్లలు ఊపిరి తీసుకోవడానికి ఎక్కువ 
ఇబ్బంది పడుతున్నప్పుడు... జలుబుతో పాటు 101 డిగ్రీల కన్నా జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు... జలుబు ఉండి, ఆహారం తీసుకోవడానికి కష్టమైనప్పుడు... జలుబు రోజుల్లో పిల్లలు మత్తుగా ఉన్నట్టు అనిపించినప్పుడు... జలుబుతో పాటు చెవిపోటు లాంటివేమైనా వచ్చినప్పుడు... జలుబు వారం రోజుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు... వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండి జలుబుతో పాటు ఇతర సమస్యలు ఉన్నా, బలహీనంగా ఉన్నా, హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ ఉన్నా, న్యుమోనియా ఉన్నా... వైద్యులను తప్పనిసరిగా సంప్రదించి, పిల్లల ఆరోగ్యం పట్ల తగు సూచనలు తీసుకొని జాగ్రత్తలు పాటించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top