కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం

  బ్రేక్‌ఫాస్ట్‌ను వండే సమయం లేనప్పుడు పెసర్ల వంటి పొట్టు తీయని గింజధాన్యాలను నానబెట్టి, ప్రతిరోజూ ఉదయం ఏదో ఒక పండుతో పాటు తిని, పాలు తాగడం టిఫిన్‌కు ఒక ప్రత్యామ్నాయం. 

కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. అణువులో బ్రహ్మాండంలా... ఇవి చూడటానికి చిన్న సూచనల్లా అనిపించినా, వాటితో సమకూరే ఆరోగ్యం మాత్రం చాలా గొప్పది. దీర్ఘకాలిక ఆయుష్షు కోసం చిట్కాలు...

మన ప్రతి జీవకణంలోనూ ప్రతిరోజూ జరిగే జీవక్రియల్లో కణానికి కొంత నష్టం జరుగుతుంది. దీన్ని సెల్ డ్యామేజ్ అని అభివర్ణిస్తారు. యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం సెల్ డ్యామేజ్ తగ్గడమే కాకుండా, కణానికి తగిలే దెబ్బలను యాంటీఆక్సిడెంట్స్ రిపేర్ చేస్తాయి. మనం తీసుకునే ప్రధాన ఆహారానికి తోడుగా బాదం, క్యారట్, టొమాటోలను కలిపి తింటే మంచి ఆరోగ్యం సమకూరుతుంది. ఉదాహరణకు బ్రెడ్‌తో ఈ ముక్కలన్నింటినీ శాండ్‌విచ్‌లా కలిపి తినడం మంచిది.

కూరగాయల సలాడ్‌తో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. ఇటీవల క్యారట్, టొమాటో, చిన్న చిన్న ఉల్లి ముక్కలతో సలాడ్స్ చేసి తీసుకోవడం పెరిగింది. ప్రధాన భోజనం సమయంలోనూ, చిరుతిండిగా శ్నాక్స్ తీసుకునే సమయంలో ముందుగా ఈ సలాడ్ తీసుకుంటే మంచిది.

కొవ్వు తీసిన పాలతో తోడేసిన పెరుగును ఆహారం తర్వాత తీసుకోవడం వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఈ పెరుగును చిలికి మజ్జిగ చేసుకుని అందులో కొద్దిగా మిరియాలపొడి, జీలకర్ర, అల్లం రసంతో కలుపుకుని బటర్‌మిల్క్ రూపంలో తాగడం వల్ల వంటికి మంచిది. రోజూ ఎక్కువసార్లు కూల్‌డ్రింక్స్/ఏరేటెడ్ డ్రింక్స్ తాగేవారు దానికి బదులు ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల కూల్‌డ్రింక్స్ నుంచి కలిగే దుష్పరిణామాలను నివారించడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఏకకాలంలో సమకూర్చుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top