ఒబెసిటి సమస్య పరిష్కారంలో ఆయుర్వేద చికిత్స సురక్షితమైనది

ఆయుర్వేద చికిత్స.. ఒబెసిటి సమస్య పరిష్కారంలో ఆయుర్వేద చికిత్స సురక్షితమైనది, కచ్ఛితమైన ఫలితాలను ఇచ్చేదని చెప్పవచ్చు. ప్రపంచ ప్రసిద్ధ ఆర్య వైద్య ఫార్మసి(కోయంబత్తూరు) సంయుక్త ఆధ్వర్యంలో పనిచేస్తున్న మంజుష ఆయుర్వేదిక హాస్పిటల్ ఒబేసిటికి సంపూర్ణ, శాశ్వత పరిష్కారాన్ని అందచేస్తోంది. అధిక బరువును తగ్గించడానికి మేము అందచేస్తున్న చికిత్సా పద్ధతులు ఈ అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తాయి.

ఒబేసిటికి మూల కారణాలను సరిచేయడం ,శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం, అధిక బరువును తగ్గించడం.

ఒబేసిటి కారణంగా తలెత్తిన ఇతర ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం.

అందరి శరీర ధర్మాలు ఒకేలా ఉండవు కాబట్టి ఒక్కో వ్యక్తి శరీర ప్రకృతి, దోష స్థితి, జీవన శైలి, ఆహార అలవాట్లు, జీర్ణ వ్యవస్థ పనితీరు, పూర్వ ఆరోగ్య చరిత్రను దృష్టిలో ఉంచుకుని చికిత్సను అందచేయడం జరుగుతుంది.

శరీర వ్యవస్థను దారిలో పెట్టడానికి మందులను ఇవ్వడం జరుగుతుంది.


కొవ్వును తొలగించడానికి దాదాపు 150 వేర్వేరు తైలాలను బాహ్య థెరపీలకు ఉపయోగించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కేరళ థెరపీల ద్వారా కొవ్వు కరగడంతోపాటు చక్కని శరీరాకృతి లభిస్తుంది.

అధిక బరువును తగ్గించడానికి చేసే చికిత్సల వల్ల బరువు తగ్గడమే కాకుండా, అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ వంటి దుష్ప్రభావాలు కూడా అదుపులోకి వస్తాయి. శరీరంలోని మలినాలను సంపూర్ణంగా తొలగించి పరిపూర్ణ ఆరోగ్యంతులను చేయడంపైనే ఆయుర్వేదం ప్రధానంగా దృషి సారిస్తుంది. ఈ కారణంగా థైరాయిడ్ లోపాలు, హార్మోనల్ అసమతుల్యత వంటి సమస్యలను అదుపులోకి తీసుకురావడంతోపాటు బరువు తగ్గడం, అంతేగాక కండరాలు, ఎముకలు బలోపేతం కావడం జరుగుతుంది. మొత్తంగా జీవన ప్రమాణం మెరుగుపడుతుంది.

ఎంతబరువు తగ్గుతారు?
సాధారణంగా కేరళ ప్రత్యేక థెరపీలతో చికిత్స ప్రారంభించిన 4-5 వారాలలోనే గుణం కనపడుతుంది. దాదాపు 5-10 కిలోల బరువు తగ్గుతుంది. అలాగే శరీర చుట్టుకొలత 15-25 సెంటీమీటర్లు తగ్గుతుంది. అనుభవజ్ఞులైన ఆయుర్వేదిక్ థెరపిస్టులు అందచేసే ప్రత్యేక మర్దనలతో శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దడం మా ఆసుపత్రి ప్రత్యేకత. మేము అందచేసిన చికిత్సలతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పూర్తిగా కరిగిపోవడం వల్ల చికిత్సలు పూర్తయిన నెలరోజుల తర్వాత కూడా బరువు తగ్గడం జరుగుతుంది. శరీర జీవ క్రియను సరిచేయడం వల్ల చక్కని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించడం సాధ్యపడుతుంది. ఉపవాసాలతో కడుపు మాడ్చుకోవాలని మా పేషెంట్స్‌కు మేము సూచించడం జరగదు. అయితే రోగి శరీర ప్రకృతిని అనుసరించి ఆరోగ్యవంతమైన జీవనశైలి, పౌష్టికాహారంతో కూడిన ఆహారం తీసుకోవలసిందిగా సూచించడం జరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top