ప్రకృతి సోయగాల నెలవు... పేరుపాలెం బీచ్‌

మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలానికి చెం దిన గ్రామము పేరుపాలెం. ఈ గ్రామం ఒక సుందరమైన పర్యాటక ప్రదేశమని చెప్పుకో వచ్చు. ఎందుకంటే, ఇక్కడ మనోహరమైన, సువిశాలమైన సాగరతీరం కలదు. ఈ పేరుపాలెం బీచ్‌ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.పేరుపాలెం సాగర తీరంలో హిందువుల ఆరాధ్య దెైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్షే త్రం, వేళాంగణి మాత ఆలయాలు ప్రసిద్ధమై నవి. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ వనభోజ నాలు ఘనంగా జరుగుతాయి. వేలాదిమంది యాత్రికులు అనేక ప్రదేశాల నుంచి ఇక్కడ కు విహారానికి వస్తుంటారు.

పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన పట్టణం నరసాపురం. నరసాపురం అనే పేరుతోనే ఉన్న మండలానికి కూడా ఈ పట్టణం కేం ద్రంగా ఉంటుంది. అన్నట్టు.. ఈ నర్సాపూర్‌ కు దగ్గర్లోనే ఉంటుంది పేరుపాలం బీచ్‌. ఈ పట్టణం చుట్టుప్రక్కల పచ్చటి వరిపొలాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.
నరసాపురం దగ్గర్లో గోదావరి నది సము ద్రంలో కలుస్తుంది. ఈ పట్టణానికి దగ్గర్లోనే అనేక సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్ప టికీ... పేరుపాలెం బీచ్‌ మాత్రం బాగా ప్రసి ద్ధి చెందింది. నరసాపురం పట్టణం అయిన ప్పటికీ... అక్కడి వాతావరణం పల్లెటూళ్లను పోలినట్లుగా ఉంటుంది.

నరసాపురంలో దాదాపుగా కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో దొరికే అన్ని రకాల అల్ఫాహారా లూ దొరుకుతాయి. మసాలా బజ్జీ, అల్లం పెసరట్టు, పరాఠా ఆమ్లెట్‌, రకరకాల చట్నీల తో వేడి వేడి ఇడ్లీ తదితర పదార్థాలు పర్యాట కుల నోరూరిస్తాయనడంలో సందేహం లేదు. అలాగే నరసాపురం చుట్టుప్రక్కల ప్రాంతాల అందాలను, సముద్ర తీర ప్రాం తాల అందాలను చూసేందుకు వచ్చే పర్యాట కులు అనేక రకాల వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top