నాజూకైన నడుము, చూడముచ్చటైన శరీరాకృతి కావాలంటే.....

నాజూకైన నడుము, చూడముచ్చటైన శరీరాకృతి, శారీరకంగా కావాలంటే చేయవలసిందల్లా మీరు కాస్తంత సమయం కేటాయించాలి.మీకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కాస్త వ్యాయామం చేయడమే. ఆరోగ్యమైన అందమైన ఫలితాలు సొంతమవుతాయి.


సమాంతరంగా ఉన్న నేల పెై వెల్లకిలా పడుకొని చేతులను జోడించి తల వెనక్కి నిటారుగా పెట్టండి.ఇప్పుడు మీ కుడి మోకాలును నెమ్మదిగా పెైకి లేపండి. ఇలా మీ పాదం నేలకు సమాంతరంగా ఆనుకునే వరకు లేపండి. తల వెనక్కి పెట్టిన చేతులలానే మీ కుడికాలును కూడా ముందుకు నిటారుగా అం టే పాదం పూర్తిగా ముందుకు వంచగలిగినంత వంచండి. ఇప్పుడు తల వెనక్కి జోడించి పెట్టిన చేతులను మీ ఎడమ కాలిమీదకు అలాగే నిటారుగా తీసుకురండి. ఇలా ముందుకు, వెనక్కు మోచేతులు ఏమాత్రం వంచకుండానే చేయండి. ఇప్పుడు కుడికాలును అలానే ఉంచి ఎడమకాలును నేలకు 90 డిగ్రీల కోణంలో పెైకి లేపాలి. ఇదే భంగిమలో ఉండి శ్వాసను మాములుగానే తీసుకుంటుండాలి. 


ఇలా ఐదు సెకండ్లపాటు ఉండండి. శిరస్సు వెనక్కి ఉన్న చేతులను అలానే తెచ్చి మీ ఎడమ కాలును తాకించండి. ఈ ప్రయత్నంలో మీ మెడను జాగ్రత్తగా ముందుకు వంచండి. ఊపిరి మామూలుగానే తీసుకుంటూ ఈ వ్యాయామాన్ని అనేక సార్లు చేయండి.నమస్కార భంగిమలో... ఇప్పుడు అదే చేతులను మీ ఛాతిపెైకి తీసుకురం డి. నమస్కారం చేసే విధంగా తల నుంచి మీ భుజాల వరకు మాత్రం అలా గాలిలోనే ఉండనీయం డి.ఇప్పు డు జోడించిన ఆ చేతులను ఇంతకు ముందు మీ ఎడమ కాలిని తాకిన చోటికీ, ప్రస్తుతం ఉన్న చోటికీ అదే ఆకారంలో ముం దుకూ, వెనక్కి మార్చండి. ఇలా చేసే క్రమంలో కుడికాలు పాదం నేలకు పూర్తిగా ఆనుకుని ఉండేలా చూసుకోండి. కాళ్లు కాస్త దూరంగా ఉండేలా నిలబడి రెండు చేతులను తలపెైకి నిటారు గాపెట్టి, ఒక చేతి తో మరొక చేతి వేళ్లలను పట్టుకొని రెండు పక్కలకు నడుమును వంచుతూ వ్యాయామం చేయాలి. చేసేటప్పుడు మోకాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. 

నడుముకు నాజూకుతనాన్ని ఇచ్చే వ్యాయామాలు
మీరు ఇలా కొన్ని సార్లు చేసిన తరువాత కుడివెైపుగా వంగినపుడు కుడిచేతితో విడిగా మీ కుడి కాలును తాకండి, ఎడమవెైపూకు వంగి నపుడు ఇదే విధంగా ఎడమచేతి తో విడిగా ఎడమ కాలును తాకం డి.ఇలా కొన్నిసార్లు చేయాలి. పక్కకు వంగి చేతితో కాలిని తాకినపుడు అలానే పదిసెకన్లు పాటు ఉండాలి. మీ శక్తిని పూర్తిగా ఉపయోగించి అలా చేసి న తరువాత నిటారుగా నిలుచుని మళ్ళీ రెండవ పక్కకు శరీరాన్ని వంచి ఇదే వ్యాయామాన్ని కొనసాగించాలి.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top