తినే పద్ధతిలో కూడా ఆరోగ్యసూత్రాలుంటాయంటున్నారు జపాన్‌కి చెందిన ఆరోగ్యనిపుణులు. వేగంగా తినడం వల్ల డయాబెటీస్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. అంతేకాదు గబగబా తినడం వల్ల అవసరానికంటే ఎక్కువగా తినే అవకాశం ఉందంటున్నారు. "పండ్లు, రోటీలు వంటి ఆహారం సంగతి పక్కన పెడితే జంక్‌ఫుడ్ తినేప్పుడు తప్పనిసరిగా స్పీడు తగ్గించాలి. చిప్స్ వంటి స్నాక్స్ వేగంగా తింటే ఎన్ని తిన్నా తిన్నట్టు ఉండవు. ఆహారం వేగంగా తీసుకోవడం వల్ల మన రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సిన స్థాయికంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని వల్ల భవిష్యత్తులో డయాబెటీస్ బారిన పడతారు'' అని చెప్పారు డాక్టర్ అమోల్.
తినే పద్ధతిలో కూడా ఆరోగ్యసూత్రాలు
teluguLifestyle Editor
10:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.