గోధుమ అన్నం,రొట్టెలు తింటే బరువు తగ్గడం సాధ్యం కాదా?

ఇటీవల కాలంలో ఇంచుమించు నేను తరచు వింటున్న మాట ఇదే! అయితే అన్నం తినడం మానేసి రొట్టెలు తినడం సరికాదు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలోనివారి శరీరతత్వం అన్నం తినడానికి మాత్రమే అలవాటు పడింది కాబట్టి అన్నం తినడం మానేసి ఎండురొట్టెలు లేదా గోధుమలతో తయారు చేసిన పదార్థాలు తిని హరించుకునే శక్తి మనవాళ్లకు లేదు. అదేవిధంగా అన్నానికి బదులుగా ఓట్‌మీల్స్, గింజలు, సోయా, ఎగ్స్, సీఫుడ్, ఈస్ట్, మష్రూమ్స్‌ను తినడం, ముడిబియ్యంతో వండిన అన్నం తినడం కూడా ఈ మధ్య కాలంలో బాగా కనపడుతోంది. నా ఉద్దేశ్యంలోఇవేమీ సరికాదు.

గ్లైకెమిక్ ఇండెక్స్ లేదా జీ1 ప్రకారం కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహార వినియోగం అందరిపైనా ఒకే విధమైన ప్రభావం చూపదు. ఒక్కొక్కరి శరీరతత్వంపై ఒక్కోలా పని ఉంటుంది. ఒక ప్రాంతం వారికి బాగా సరిపడే ఆహారం మరొక ప్రాంతం వారికి విషతుల్యంగా ఉండవచ్చు. అలాగే ఒకరికి బాగా పని చేసిన మందులు, వంటబట్టిన ఆహారం మరొకరి విషయంలో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. కేలరీల విషయానికి వస్తే గోధుమలకు, వరికి మధ్య అంతగా తేడా ఏమీ లేదు. 



ప్రపంచవ్యాప్తంగా గోధుమలు ఎక్కువగా వినియోగించే వారు అధికంగా సెలియాక్ అనే ఒక ప్రమాదకరమైన వ్యాధి బారిన పడుతున్నట్లు పరిశోధనలలో తేలింది. ఇది మన దేశంలో 60 సంవత్సరాలపైబడిన వారిలో వస్తే, ఇతర దేశాలలో అంటే బార్లీ, గోధుమ, రై, ఓట్స్, ప్యాక్ చేసిన ఆహారం ప్రధానాహారంగా తీసుకునే దేశాలలో ప్రజలలో చాలా చిన్నవయసులోనే వస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల పొరుగు రాష్ట్రాలు, దేశాల వారిని చూసి వారి ఆహారపుటలవాట్లను మనం అనుకరించడం మానివేయాలి. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్సర్‌సైజ్‌లు ఎక్కువగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top