కదలకుండా కూర్చుని అడ్వెంచర్స్ చేయాలని ఉందా? గంటకు 200 మైళ్ల స్పీడుతో దూసుకెళ్లాలని ఉందా? అయితే మీ సెల్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో సరికొత్త గేమ్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీరు కోరుకున్నవన్నీ అందులో లభిస్తాయి. మిమ్మల్ని కొత్త లోకాల్లో విహరింపజేసే అద్భుతమైన గేమ్స్‌ను ఇప్పుడు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా ఆనందాన్నిచ్చే అరుదైన గేమ్స్ మీ కోసం...
ఒకప్పుడు గేమ్స్ అంటే వేళ్లపై లెక్కించేనన్ని. ఇప్పుడు కొన్ని వందలు. అందులోనూ 3 డి ఎఫెక్ట్స్‌తో, మాయాజాలాన్ని సృష్టిస్తున్నాయి. యాక్షన్, పజిల్, రేసింగ్ ...ఇలా అభిరుచిని బట్టి ఎంచుకునే సౌలభ్యం. వందల కొద్దీ గేమ్స్ google play, Humble Indie Bundleలో ఉచితంగా లభిస్తున్నాయి. అందులో మీ స్నేహితులతో షేర్ చేసుకోదగిన కొన్ని గేమ్స్ ఇవి.
అక్వేరియా పబ్లిషర్ : బిట్ బ్లాట్
10 ఏళ్లలోపు బాలికలకు కావలసినంత ఫన్‌ను అందించే గేమ్ ఇది. అండర్ వాటర్ వరల్డ్‌లో జరిగే ఫాంటసీ స్టోరీ. మౌస్‌తోనే గేమ్ ఆడేయవచ్చు.
ఎడ్జ్ పబ్లిషర్ : మోబిగేమ్
ఇండిపెండెంట్ గేమ్ ఫెస్టివల్‌లో అవార్డు సాధించిన పజిల్ గేమ్ ఇది. టచ్‌స్క్రీన్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే మరింత సులభంగా ఆడవచ్చు. ఎన్నో అంతరాయాలు,లెవెల్స్‌ను దాటుకుంటూ క్యూబ్ ముందుకు వెళ్లేలా గైడ్ చేయాలి.
స్పైడర్ మంకీ
ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపై దుంకుతూ అరటిపండ్లను కోయాల్సి ఉంటుంది. స్నేహితులను రక్షించాల్సి ఉంటుంది. ప్రతీలెవెల్‌లోని చెక్‌పాయింట్స్‌లో గోల్డ్ రింగ్స్ ఉంటాయి. చుట్టూ ఉన్న చెట్లన్నీ ఎక్కేసి ఫినిషింగ్ పాయింట్‌ను చేరుకోవాలి. పిల్లలు ఇష్టంగా ఆడుకునే గేమ్ ఇది.
స్పీడ్‌మోటో
3డి ఎఫెక్ట్‌ను అందించే రేసింగ్ గేమ్. మోటర్‌సైకిల్‌పై అడవిలో, బ్రిడ్జ్‌పైన, మంచు పర్వతాల చెంత రయ్యన దూసుకెళ్లచ్చు. మోటర్‌సైకిల్ రైడింగ్ ఇష్టపడే వారు ఎంచుకోదగిన గేమ్.
యాంగ్రీబర్డ్స్
ఇటీవల పాపులర్ అయిన గేమ్ ఇది. తమ గుడ్లను దొంగిలిస్తున్న గ్రీడీ పిగ్స్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే గేమ్. ఛాలెంజ్‌డ్ బేస్‌డ్ గేమ్‌ప్లే ఇది.
క్రేయాన్ ఫిజిక్స్ డీలక్స్ పబ్లిషర్ : పెట్రి పుర్హో
క్రియేటివ్ 2డి పజిల్ సాల్వింగ్‌గేమ్ ఇది. ఆబ్జెక్ట్స్‌ను గీస్తూ వాటిని అనుసంధానం చేస్తూ వెళ్లాల్సిఉంటుంది. ఈ గేమ్‌లో 70 లెవెల్స్ వరకు ఉన్నాయి. మీకిష్టమైన లెవెల్‌ను ఎంచుకోవచ్చు.
జెన్ బౌండ్2 పబ్లిషర్ : సీక్రెట్ ఎగ్జిట్
చెక్క బొమ్మల చుట్టూ తాడును చుడుతూ ఆడాల్సిన పజిల్ గేమ్. న్యాచురల్ ఆబ్జెక్ట్స్ మాదిరిగా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడం ఈ గేమ్ ప్రత్యేకత. సౌండ్ ట్రాక్,కంట్రోల్ సిస్టమ్ అదనపు ఫీచర్లు.
కాగ్స్ పబ్లిషర్ : లేజీ 8 స్టూడియోస్, ఎల్ఎల్‌సి
ఇది కూడా అవార్డ్ సాధించిన పజిల్ గేమ్. త్రీ గేమ్‌ప్లే మోడ్స్, 50 యూనిక్ లెవెల్స్ ఇందులో ఉన్న ఫీచర్స్. కొన్ని సెకన్ల సమయంలోనే పజిల్ పూర్తి చేసి మరో స్టెప్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ట్రైన్ పబ్లిషర్ : ఫ్రోజెన్‌బైట్
కలర్‌ఫుల్, వెరీ గుడ్‌లుకింగ్ యాక్షన్ బేస్‌డ్ గేమ్ ఇది. మల్టిపుల్ ప్లేయర్స్ ఆడే వీలుంది.
ఓస్మోస్ పబ్లిషర్ : హెమిస్‌ఫెరె గేమ్స్
చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనే సూత్రంతో గేమ్ మొదలవుతుంది. మోట్స్ అని పిలిచే చిన్న వస్తువు సహాయంతో ఆడాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న వస్తువు కన్నా చిన్న వస్తువులను గ్రహించడం ద్వారా పెద్దగా మారాలి. ప్రతీ లెవెల్‌లో చాలా పెద్ద నిర్మాణాలుంటాయి. అవి చిన్న వాటిని గ్రహించేస్తుంటాయి. వాటిని తాకినా అంతే సంగతులు. వాటి దారిలోకి వెళ్లకుండా వాటిని మించి సైజులోకి మారేలా ఆడాల్సి ఉంటుంది.
మాచినేరియమ్ పబ్లిషర్ : అమనిట డిజైన్
రోబో గేమ్ ఇది. గర్ల్‌ఫ్రెండ్‌ను రక్షించుకోవాలనే కథాంశంతో కూడి ఉంటుంది. కావలసినంత ఫన్‌ను అందిస్తుంది.