కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆస్త్మా లక్షణాలు ఎక్కువవుతాయని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ న్యూకాజిల్‌కు చెందిన పరిశోధకుల బృందం అమెరికన్ థోరాసిస్ సొసైటీ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నది. ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువైతే దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని పరిశీలనలో తేలింది. ఇందులో భాగంగా కొవ్వు పదార్థాలను తీసుకున్న తర్వాత రోగి తాలూకు స్పుటమ్ (కళ్లె) శాంపిల్స్‌ను పరీక్షించినప్పుడు అందులో వాపును తగ్గించే న్యూట్రోఫిల్స్ వంటి వ్యాధినిరోధక కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది.
దాంతోపాటు ఆ రోగులు కొవ్వుపదార్థాలతో కూడిన ఆహారం తీసుకున్న తర్వాత దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సేపు తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆస్తమా ఇన్‌హేలర్స్ (బ్రాంకోడయలేటర్స్) వాడినా ఫలితం కనిపించలేదు. దీన్ని బట్టి ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్న వారు బిర్యానీ, ఎక్కువ నూనెలతో వండిన కూరలను తీసుకోకపోవడమే మంచిదని చెప్పచ్చు. ఆస్తమా ఉన్నవారు సైతం వ్యాయామం చేయవచ్చు. వారి ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడం కోసం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వంటివి కూడా చేయాలి. |
వేపుడు కూరలు, బజ్జీలు, కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆస్తమా ఎక్కువవుతుందా?
7:30:00 PM
Share to other apps

