మంచి ఆహారంతో సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం. అందుకు అనుసరించాల్సిన సూచనలు కూడా తేలిగ్గా ఉంటే ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడం కూడా చాలా సులువవుతుంది. అందుకు కొన్ని మార్గాలివి...
పీచు ఎక్కువగా ఉన్న ఆహారం, పళ్లు తీసుకోవడం ఎన్నో రకాలుగా మంచిది. అది జీర్ణాశయమార్గాన్ని శుభ్రంగా ఉంచడం, తేలిగ్గా విరేచనం అయ్యేలా చేయడమే కాదు... మన రక్తంలోని కొలెస్ట్రాల్‌నూ, చక్కెరపాళ్లను నియంత్రణలో ఉంచడానికీ దోహదపడుతుంది. పీచు ఎక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పొట్టుతో ఉండే కాయధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా రకాల క్యాన్సర్లను రాకుండానే నివారించడం సాధ్యమవుతుంది. పూర్తి పండులో ఉండే పీచు పదార్థాలన్నీ, అదే పండును పళ్లరసం రూపంలో తీసుకుంటే ఉండవని గ్రహించాలి. అందుకే పండును జ్యూస్ రూపంలో కంటే పండుగానే తీసుకోవడం మంచిదని గ్రహించండి. చిక్కుళ్లలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. వాటిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. అందుకే మీరు సలాడ్స్‌లోనైనా, సూప్స్‌లోనైనా ఉడికించిన చిక్కుళ్లను ఉపయోగిస్తే అది శక్తిని, ఆరోగ్యకరమైన కండరాలనూ ఇవ్వడంతో పాటు పీచుపదార్థాల వల్ల ఒనగూరే ప్రయోజనాలనూ ఇస్తుంది. ఇక పీచుపదార్థాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. అది అనేక జబ్బులకు నివారణగా పనిచేస్తుంది. అందుకే మన జీర్ణాశయ ఆరోగ్యం కోసం పీచుతో కూడిన ఆహారంతో పాటు రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మరవకండి. |
మంచి ఆహారంతో సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం. అందుకు అనుసరించాల్సిన సూచనలు....
10:45:00 AM
Share to other apps

