ఇంట్లో వాటర్ హీటర్ ఉందా? వాడుతూంటే బిల్లులు మోతమోగిపోతున్నాయా?


ఇంట్లో వాటర్ హీటర్ ఉందా? వాడుతూంటే బిల్లులు మోతమోగిపోతున్నాయా? అయితే ఈ కథనం మీ కోసమే. అమెరికాకు చెందిన ప్రసిద్ధ వాటర్‌హీటర్ తయారీ సంస్థ ఏ.ఓ.స్మిత్ విద్యుత్తును గణనీయంగా ఆదా చేసే ఓ వినూత్న ఉత్పత్తిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. సాధారణ వాటర్‌హీటర్లు విద్యుత్తుతో నీటిని వేడిచేస్తే... ఈ కొత్త ‘ఎయిర్2హీట్’ మాత్రం గాల్లో ఉండే ఉష్ణాన్ని శోషించుకుని నీళ్లను వేడి చేస్తుంది.

ఇందుకోసం ఏ.ఒ.స్మిత్ కంపెనీ రిఫ్రిజరేటర్లలో మాదిరిగా ఓ రిఫ్రిజరెంట్‌ను, కంప్రెషర్‌లను ఉపయోగించింది. ఉష్ణాన్ని అతితక్కువగా మాత్రమే విడుదల చేసే ప్రత్యేక పదార్థాన్ని ఉపయోగించి ఈ హీటర్ కవచాన్ని నిర్మించారు. వేడిని గ్రహించి నీళ్లు ఉన్న చోటికి తరలించడం... అక్కడున్న చల్లటి నీటిని మళ్లీ హీటర్ ఎక్స్ఛేంజర్ వద్దకు తీసుకురావడం... ఇదే ప్రక్రియ మళ్లీమళ్లీ కొనసాగించడం ద్వారా ఎయిర్2హీట్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top