నిత్యం నీరసంగానే అనిపిస్తోందా? ఎప్పుడూ అలసటగానే ఉంటోందా?

నిత్యం నీరసంగానే అనిపిస్తోందా? బహుశా ఐరన్ ట్యాబ్లెట్లతో మీకు మంచి ఫలితం ఉండవచ్చు.
ఎప్పుడూ అలసటగానే ఉంటోందా? నిత్యం నీరసంగానే అనిపిస్తోందా? బహుశా ఐరన్ ట్యాబ్లెట్ల్లతో మీకు మంచి ఫలితం ఉండవచ్చు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇలా అలసటగా ఉండటం అన్నది మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇలాంటివారు డాక్టర్ సలహా మేరకు కనీసం పన్నెండు వారాల పాటు ఐరన్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల సగం మందిలో మంచి ఫలితాలు కనిపించాయి అంటున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లాసేన్ పరిశోధకులు డాక్టర్ బెర్నార్డ్ ఫావ్ రట్.

పైగా ఐరన్ ట్యాబ్లెట్లు వాడుతున్న సగంమందిలో కేవలం ఆరు వారాల తర్వాత నుంచే వాటి సత్ఫలితాలు అంటే... హిమోగ్లోబిన్ పాళ్లు, ఫెరిటిన్ పాళ్లు మెరుగుకావడం మొదలైందట. ఈ అధ్యయనం తాలూకు పాజిటివ్ ఫలితాలు కెనెడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో చోటుచేసుకున్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top