చాక్లెట్ కంటికి కనబడగానే తినేయాలనిపిస్తుంది. నోరూరించే చాక్లెట్లు ఇప్పుడు ఫెషియల్కిట్లోకి చేరిపోయాయి. డార్క్ చాక్లెట్‌తో ఫెషియల్ చేసుకుంటే చర్మం మిలమిలా మెరిసిపోతుందంటున్నారు సౌందర్యనిపుణులు అదెలాగంటే... డార్క్ చాక్లెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మందపాటి గిన్నెలో వేసి పొయ్యిమీద పెట్టాలి. చాక్లెట్ మొత్తం కరిగాక దించేయాలి. అందులో రెండు టీ స్పూన్ల స్వచ్ఛమైన తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారిన తర్వాత మొహానికి పూసుకోవాలి. చాక్లెట్ మిశ్రమం బాగా గట్టిపడిపోతే కొద్దిగా పచ్చిపాలు పోసి కలుపుకోవచ్చు. చాక్లెట్ ప్యాక్ బాగా ఆరిపోయిన తర్వాత చేతులు తడి చేసుకుని మొహమంతా మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చటినీటితో మొహం కడిగేసుకుంటే చర్మం తేమగా కనిపిస్తుంది.