బ్యూటీపార్లర్‌లకు వెళ్లే తీరిక లే కుంటే ఇంట్లోనే అంతకంటే మెరుగెైన ఫలితాలు పొందడానికి ఈ ట్రీట్‌మెంట్లు.


  • పొడిబారిన చర్మాన్నే కాదు. గాయాల్ని, కాలిన మచ్చలపెైనా రాసుకోవచ్చు. తగ్గించే శక్తి తేనె సొంతం స్నానానికి పదినిమిషాల ముందు తేనెను శరీరమంతా పట్టించుకోవాలి. దీనివల్ల చర్మం కోమలంగా తయారవు తుంది.
  • మూడు చెంచాల కొబ్బరి నూనెకు నాలుగు చెంచాల తేనె కలిపి బాగా గిలక్కొట్టి తలకు రాసుకోవచ్చు. పొడిబారిన జుట్టుకి ఇది చక్కని పరిష్కారం. తేనె వల్ల జుట్టు నెరుస్తుందనేది కేవలం అపోహ మాత్రమే.
  • చర్మం మరీ పొడిబారితే.. చెంచా తేనెలో సోయా పిండి, కొబ్బరిపాలు రెండుచెంచాల చొప్పున కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక రుద్దుతూ పూతను తీసేయాలి. మోము ప్రకాశవంతంగా మారుతుంది. శరీరానికైతే.. ఈ మిశ్రమాన్ని రెండింతలు కలిపి పూతలా వేసుకోవచ్చు.
  • ఒక టీ స్పూన్‌ నిమ్మరసంలో కొద్దిగా తేనె, రెండు చుక్కల గ్లిజరిన్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకి ప్రతిరోజూ అప్లై చేస్తూ ఉంటే పెదవుల పెై ఉన్న నలుపు క్రమంగా తగ్గి పువ్వు లాంటి రంగుతో మెరిసిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top