ముక్కుదిబ్బడ వదలాలంటే...

మనం తరచూ ఎదుర్కొనే సమస్యల్లో ముక్కు దిబ్బడ ఒకటి. దీన్ని అధిగమించడానికి మనం చిన్న చిన్న చిట్కాలు ఉపయోగిస్తే చాలు... చక్కని ఉపశమనం పొందవచ్చు.


గోరువెచ్చని నీళ్లలో యూకలిప్టస్ ఆయిల్‌గాని, విక్స్‌గాని కలిపి ఆవిరిపడితే ఫలితం ఉంటుంది. 


ముక్కులో అడ్డంకి ఉన్న ఫీలింగ్‌ను అధిగమించేందుకు కొందరు బలంగా చీదుతుంటారు. ఇది సరికాదు. ముక్కు రంధ్రాలు రెండింటినీ ఒకేసారి తెరుచుకునేలా చీదకుండా, ఒక్కొక్క రంధ్రం తెరచుకునేలా ఒకదాని తర్వాత మరొకటి నెమ్మదిగా చీదాలి. 


మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. 


ముక్కు మీద, ముక్కు చుట్టూ రుద్దుకోడానికి మెత్తటిగుడ్డను ఉపయోగించాలి. 


డాక్టర్‌ను సంప్రదించేలోపు మార్కెట్‌లో లభ్యమ మయ్యే నేసల్ డి-కంజెస్టెంట్ డ్రాప్స్ వాడవచ్చు. 
ఇన్ని చేసినా సమస్య వీడకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top