స్లిమ్‌గా మారాలంటే...

సన్నబడాలంటే తిండే మార్గమని యు. ఎస్ న్యూట్రిషన్ అకాడెమీ చెబుతోంది. భోజనంలో కోత పెట్టుకుంటే ఆరోగ్యం చెడిపోతుందే తప్ప ప్రయోజనం శూన్యమని అకాడెమీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. స్లిమ్‌గా మారాలని తిండిని తగ్గించుకున్న కొందర్ని ఎంచుకుని వారు తమ ప్రయోగానికి ఎంచుకున్నారు. అదే సమయంలో సమయానికి తింటూ శరీరానికి పని కల్పించే వారినీ పరిశీలించారు.

తిండి తగ్గించిన వారు వారాంతాలలోనూ, పార్టీలలోనూ కానీ రోజువారీ తినే దానికి అధికంగా తినేవారట. అందువలన దాని ప్రభావం ఒక్కసారిగా జీర్ణ వ్యవస్థపై పడి ఆరోగ్యంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సమయానికి తినే వారు పార్టీల్లో కూడా ఎంత తినగలరో అంతే తిన్నారట. దాంతో వారి జీర్ణ వ్యవస్థ ఎప్పటిలా పనిచేసింది.

పైగా తిండి మానిన వారి కంటే తినే వారే తాము అనుకున్న వ్యాయామాలను సమయానికి చేసి శరీరాకృతిని కాపాడుకోగలిగారు. సన్నబడటానికి మరిన్ని వ్యాయామాలు చేసే శక్తి కూడా వారికి ఉందట. తిండికి దూరమైన వారు మాత్రం ఆ సమయంలో ఆరోగ్యం కోసం మందులను ఆశ్రయించాల్సి వచ్చిందట. కేవలం మహిళలను దృష్టిలో ఉంచుకునే ఈ పరిశోధన ఫలితాలను విడుదల చేసినట్టు న్యూట్రిషన్ అకాడెమీ తెలియజేసింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top