పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలంటే...

పోషకాహారం పోషణనిస్తుంది. పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందిస్తే వారు యుక్తవయసులోనూ ఆ అలవాట్లను ఫాలో అవుతారు. అనారోగ్యాలకు దూరంగా ఉంటారు అంటున్నారు నిపుణులు. పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలంటే... 



ఫ్రిజ్‌లో ఉంచితే...!
ఈ రోజుల్లో పిల్లలు ఏదైనా తినుబండారం కావాలని వెతుక్కునేది ముందుగా ఫ్రిజ్‌లోనే. బిస్కట్లు, బేకరీ పదార్థాలకు బదులుగా రిఫ్రిజరేటర్ షెల్ఫ్‌ల్లో పండ్లు, పండ్ల రసాలు, నట్స్-డ్రై ఫ్రూట్స్‌తో చేసిన తినుబండారాలు... మొదలైనవి ఉండేలా జాగ్రత్తపడండి. ఆకలిమీద ఉన్నప్పుడు చేతికి దొరికినది తీసుకుంటారు. రుచిగా ఉందంటే ఆ పదార్థాన్ని పిల్లలు వదిలిపెట్టరు. అందుకని కంటికి ఇంపుగా, నోటికి రుచిగా ఉండేలా స్నాక్స్ చేసి ఉంచండి.

ఎప్పుడూ ఒకే రకమా!
పదార్థాలు ఒకే తరహాలో ఉంటే పిల్లలు త్వరగా బోర్ ఫీలవుతారు. ఒకసారి ఇష్టంగా తిన్నారు కదా అని, మళ్లీ వాటినే మరుసటి రోజు పెడితే ఇష్టపడరు. అందుకని ఏ రోజుకు ఆరోజు ఉన్న పదార్థాలతోనే కొత్తగా వంటకాలను తయారుచేయండి.

పిల్లలకు నచ్చేలా పదార్థాలను తయారుచేయడానికి మార్కెట్‌లో వంటల పుస్తకాలు, ఇంటర్‌నెట్ సమాచారం, టీవీలో ఇచ్చే వంటకాల తయారీ మీకెంతగానో ఉపయోగపడుతుంది. ఆటపాటలు తగినంతగా లేకపోవడం, జంక్‌ఫుడ్ వల్ల పిల్లలు ఊబకాయులుగా మారుతున్నారు. వారి ఆరోగ్యం, ఆనందం ఉన్నది పేరెంట్స్ చేతుల్లోనే. అందుకని మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించండి. ఆరోగ్యంగా ఎదిగే అవకాశాలు కల్పించండి. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top