వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీర్ణమయ్యే తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మాంసాహారం కన్నా శాకాహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు ఎటువంటి ముప్పు ఉండదని అంటున్నారు డైటీషియన్లు. వంటకాలలో అల్లం, ఉల్లిపాయలను ఎక్కువగా ఉపయోగించాలి. అల్లం తీసుకోవడం వల్ల కడుపులో ఉండే క్రిములు నశిస్తాయి. అలాగే కాకర, బార్లీ, ఓట్స్ వంటి ఆహారంగా తీసుకుంటే మంచిది. ఈ కాలంలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను నీటితో బాగా కడిగిన తరువాతే తీసుకోవాలి.

