బరువు పెరగడానికి కారణాలేంటని అడిగితే....నాన్‌స్టాప్‌గా నలభై కారణాలు చెప్పొచ్చు. ఆ లిస్టులో మరో కారణం కూడా చేరిపోయింది. శరీరానికి సరిపడా ఎండ తగలకపోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎండకు, బరువుకి సంబంధం ఏంటంటారా...మన శరీరంపై సూర్యకిరణాలు పడడం వల్ల డి విటమన్ వస్తుంది. మన ఒంట్లో డి విటమన్ లోపం ఉంటే కాల్షియం కూడా తక్కువైపోతుంది. ఊబకాయంతో బాధపడుతున్నవారికి కాల్షియంలోపం చాలా ఎక్కువగా ఉంటుంది. మనలో కాల్షియం లోపం లేకుండా చూసుకుంటే కాని ఊబకాయం నుంచి బయటపడలేం. కాల్షియం కావాలంటే రోజూ ఎండలో అరగంటైనా ఉండాలని అంటున్నారు వైద్యనిపుణులు. కొంచెంసేపు ఎండలో ఉండాలంటే తెగ బాధపడిపోయేవాళ్లు ఈ విషయాన్ని గమనించాలని కూడా చెబుతున్నారు.
బరువు పెరగడానికి కారణాలేంటని అడిగితే....
teluguLifestyle Editor
12:32:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.